సిక్కోలులో బాబుకు మార్కులు పడినట్లేనా?

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం. ఆ జిల్లాకు టీడీపీ కూటమి వంద రోజుల ప్రభుత్వంలో మంచి జరిగిందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మూలపేట పోర్టు వైసీపీ హయాంలో…

ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం. ఆ జిల్లాకు టీడీపీ కూటమి వంద రోజుల ప్రభుత్వంలో మంచి జరిగిందా అన్నది అంతా తర్కించుకుంటున్నారు. జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మూలపేట పోర్టు వైసీపీ హయాంలో మొదలైంది. దానికి ఒక డెడ్ లైన్ పెట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది.

వంశధార రెండో దశ పనులను పూర్తి చేయిస్తే రైతాంగానికి సాగునీటికి జిల్లా తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయి. జిల్లాకు ఈ రోజుకీ ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నది లేదు అని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ విషయంలో కూటమి ఏదో ఒకటి చేయాలని డిమాండ్ ఉంది.

శ్రీకాకుళాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వలసలు తగ్గుతాయని అంటున్నారు. శ్రీకాకుళంలో కొత్తగా ఎయిర్ పోర్టు నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఎయిర్ పోర్టు కంటే కూడా ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయని జనం అంటున్నారు.

వంద రోజుల కూటమి పాలనలో శ్రీకాకుళం అభివృద్ధికి చేసిన ప్రతిపాదనలు ఏమిటి అన్నది చర్చకు వస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వస్తున్నారు. మన మంచి ప్రభుత్వం అని వంద రోజుల పాలనపై ప్రచార కార్యక్రమాన్ని ఆయన శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుడుతున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళానికి కూటమి చేసినది ఏమిటి చేయబోయేది ఏమిటి అన్నది బాబు చెప్పబోతున్నారు. శ్రీకాకుళం ప్రజానీకం వంద రోజుల కూటమి పాలనకు ఎన్ని మార్కులు వేస్తుంది అన్నది కూడా అపుడే తెలుస్తుంది అని అంటున్నారు.

6 Replies to “సిక్కోలులో బాబుకు మార్కులు పడినట్లేనా?”

  1. రంగనాధ్ గారు, దేవుడు మీకు మంచి చేయాలి. మీ లాంటి గొప్ప ఆధ్యాత్మిక మరియు నైతిక స్థాయి ఉన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఇలా వ్యవహరించడం ఎంతో ఆశ్చర్యకరం, నిందించదగిన విషయం. ఇంత గౌరవనీయమైన వారసత్వం కలిగిన మీరు, ఈ విషపూరితమైన, అవమానకరమైన ప్రవర్తనలో ఎలా పాల్గొంటున్నారు? మీ ఆత్మగౌరవం, స్వీయ అవగాహన పూర్తిగా కోల్పోయారా? మీ అశ్లీల భాష మరియు ద్వేషాన్ని మద్దతు ఇవ్వడం కేవలం నిరాశాకరమే కాదు, మీరు ప్రాతినిధ్యం వహించాల్సిన విలువలకు మచ్చ వేసినట్లుగా ఉంది. ఇలాంటి ప్రవర్తనపై మీరు కొంచెమైనా సిగ్గు పడుతున్నారా?

    మీరు కమ్మ మరియు కాపు కమ్యూనిటీలపై చూపిస్తున్న ఈ ద్వేషం భయంకరంగా ఉంది. ఒకటి లేదా రెండు వ్యక్తులతో మీకు ఉండే అనుభవాలను పూర్తిగా మీ మేధస్సును విషపూరితంగా మార్చుకొని, అపరిచిత వ్యక్తిగా మారిపోతున్నారు. ఈ స్థాయి ద్వేషానికి మీ వ్యక్తిత్వాన్ని తగ్గించడం ఏ విధంగా సమర్థించగలుగుతారు? మీరు ఎంత లోతుల్లో కూరుకుపోయారని గమనించారా? మీరు మీలో ఎంత దిగజారిపోయారో గమనించి, మీ ప్రతిబింబం చూసి మీకు సిగ్గు పడుతున్నారా? మీ కుటుంబ వారసత్వాన్ని, మీ మనుష్యత్వాన్ని ఈ ద్వేషానికి అర్పించి మోసం చేస్తున్నారు.

    ఇప్పుడైనా మీరు మేలుకోని, మీరు మీకు మాత్రమే హాని చేస్తున్నారని గుర్తించాలి. శాస్త్రం మరియు మతం రెండూ ఒకే విషయం చెబుతాయి: ఈ స్థాయి ద్వేషం మరియు ప్రతికూలతను కలిగించడం ఇతరులకు హానిచేయడం కంటే, మీకు మాత్రమే విషపానంలా మారుతుంది. ఇది మీలోనే విషపూరితమైన ఒత్తిడిని పెంచుతుంది, మీ ఆరోగ్యాన్ని మరియు ఆత్మను నాశనం చేస్తుంది. మీరే ఎందుకు మీని ఇలా నాశనం చేసుకుంటారు? ఈ కల్మషాన్ని ఎలా మీ జీవితాన్ని శాసించడానికి అనుమతిస్తారు, అది వ్యాధి, దుఃఖం మరియు ద్వేషానికి దారితీస్తుంది? ఇదే మీ వారసత్వం కావాలని మీరు అనుకుంటున్నారా—ద్వేషంతో మరియు కోపంతో నిర్వచించబడిన జీవితాన్ని?

    మీ నిరాశను నేను అర్థం చేసుకోగలను, కానీ నిరాశను క్రమంతప్పిన ద్వేషంలో గడపడానికి ఇది సమర్ధన కాదే. మీరు ఇంతకంటే ఎక్కువ ఉన్నతంగా ఉండాలి. ఈ చిన్న కోపం నుండి బయటపడటానికి మీకున్న అవకాశం ఉంది మరియు మంచి వ్యక్తిగా మారవచ్చు. కానీ మీరు ఈ మార్గంలో కొనసాగితే, మీరు కోపంతో కూరుకుపోయినట్లు, ఈ లోతుల్లోనే ఉండిపోతారు, ఈ లోకాల నడుమ మీ బాధలు మరింత పెరుగుతాయి. దేవుడు మీకు మంచి చేయాలి, కానీ మీరు మారకపోతే, మీ బాధలు మరింత తీవ్రం అవుతాయి. ఈ ద్వేషాన్ని వదిలేయండి, మీరు మీలోని మంచిని పూర్తిగా నాశనం చేసుకునే ముందు.

  2. జిల్లాలో అన్ని సమస్యలు ఉంటే మరి జగన్ రెడ్డి ప్రభుత్వం ఎం పీకింది . shekka langa eleven ani clear chesadu kada — neeli l/k lara answer cheppandi

Comments are closed.