టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తెలివితేటల గురించి భావి తరాలకు తెలియజెప్పేందుకు మ్యూజియంలో దాచి పెట్టాల్సిన అవసరం వుందని సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. తిరుమలలో చిరుతల సంచారం ఇప్పుడే ఏదో జరుగుతున్నట్టు ఆయన అనడం విచిత్రంగా వుంది. శేషాచలం అడవిలో క్రూర మృగాలు తిరగకుండా, మరే ప్రాణులు సంచరిస్తాయో ఆయన చెప్పాలి.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లే చిరుతలు నడక మార్గంలోకి వస్తున్నాయ న్నారు. వైసీపీలో పుష్పాలు ఎక్కువయ్యారని ఆయన విమర్శించారు. వైసీపీ పుష్పాలు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడు తుండడం, ఎర్ర చందనం కోసం అడవులు నరికేయడం వల్లే చిరుతలు తిరుమల మెట్ల మార్గంలోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు. చిరుతపులిని తరమడానికి బ్రహ్మాండమైన రూళ్ల కర్ర ఇస్తారట అని ఆయన ఎద్దేవా చేశారు. ఆ రూళ్ల కర్రతో భక్తులు ప్రభుత్వానికి బడితె పూజ చేయాలని వెటకరించారు. అసమర్ధతను కప్పి పుచ్చుకోవడానికి తుగ్లక్ చర్యలకు దిగుతున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు దృష్టిలో పడేందుకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడ్డం బోండా ఉమాకు వెన్నతో పెట్టిన విద్య అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణాకు టీడీపీ నేతలు పాల్పడ్డారని, గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ డాన్ అని బాబు తీవ్ర ఆరోపణలు చేసిన నాయకుడే, ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థి అయ్యాడనే విషయం బోండాకు తెలియదేమో అని వైసీపీ నేతలు విమర్శించారు.
దట్టమైన అభయారణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కోసారి వన్య మృగాలు కనిపించడం సహజమని, దానికి, స్మగ్లింగ్‌కు ముడిపెడుతూ విమర్శలు చేసిన బోండా ఉమా మెదడును భద్రంగా దాచేందుకు ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. విజయవాడ సెంట్రల్ టికెట్ కోసమే అవాకులు చెవాకులు అని ప్రత్యర్థులు చురకలు అంటిస్తున్నారు.