బూతు వీడియోలతో టీవీ ఛానల్స్ అత్యుత్సాహం!

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు లోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారనే విషయం ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ గా ఉంది. శుక్రవారం కళాశాల విద్యార్థినుల ఆందోళనలతో రాష్ట్రం…

కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు లోని బాలికల వసతి గృహంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి వీడియోలు తీశారనే విషయం ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్ గా ఉంది. శుక్రవారం కళాశాల విద్యార్థినుల ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక విద్యావ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు.

విద్యార్థులు ఆరోపించిన హాస్టల్ ప్రాంగణంలో రహస్య కెమెరాలు ఉన్నాయో లేదో పరిశీలించేందుకు ఇంకా తనిఖీలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ.. విచారణ పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక మహిళా పోలీసు బృందం, సాంకేతిక బృందం ద్వారా విచారణ చేపడుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ‘రహస్య కెమెరాలు- వాటి ద్వారా తీసే బూతు వీడియోలు’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని దొరికిన బూతు వీడియోలు అన్నింటిని వందలసార్లు రిపీట్ చేసి ప్రదర్శిస్తూ, తెలుగు టీవీ న్యూస్ ఛానళ్లు తమ టిఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి నీచమైన ఎత్తుగడకు పాల్పడుతున్నాయి.

హాస్టల్స్‌లో బాత్రూంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారనేది విద్యార్థినుల ఆరోపణ. ఆ ఆరోపణలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ తాజా వివాదం సాకుగా పెట్టుకుని టీవీ ఛానల్ పెట్రేగి పోతున్నాయి. రహస్య కెమెరాలు ద్వారా తీసిన అసభ్య, అర్ధ నగ్న వీడియోలు ఇంటర్నెట్లో దొరికేవన్నీ కలిపి ఒక ఎపిసోడ్ గా వండి వారుస్తూ నీచమైన ఆనందం పొందుతున్నాయి. బట్టల దుకాణాలలో- దుస్తులు మార్చుకునే గదులలో సీసీ కెమెరాలు ఉన్నట్లు గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి.

అలాగే ఓయో గదులలోను, సరైన ఆధారాలు, పత్రాలు అడగకుండా, జంటలుగా వచ్చేవారికి కూడా గదులు అద్దెకిచ్చే చవకబారు హోటళ్ల గదులలోను రహస్య కెమెరాలు ఉంటాయనే విషయాలను ఈ బుల్లెటిన్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయా అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించడం అనే ప్రయత్నం మంచిదే. అందుకు టీవీ ఛానల్స్ ను అభినందించాలి. అదే సమయంలో ఈ ఎపిసోడ్ల ముసుగులో తమకు దొరికిన అన్ని బూతు వీడియోలను చూపించడం ఎంతవరకు కరెక్టు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అర్థనగ్నంగా ఉన్న వీడియోలు న్యూస్ ఛానల్స్‌లో చూపించడం, అంతకంటే నీచంగా ఉన్న వీడియోలు నెగిటివ్ లాగా చూపించడం.. ఏదైతేనేం తమ చానళ్లలో ఆడవాళ్ళ అందాలను ప్రదర్శించి రేటింగులు పెంచుకోవాలనే నీచమైన తాపత్రయం వారిలో కనిపిస్తుంది. ప్రజలు అవగాహన కలిగించాలంటే ఈ వీడియోలు చూపించకుండా కేవలం విషయం చెబితే సరిపోదా ఇలాంటి వక్రబుద్ధులు అవసరమా అని చానళ్ల వారే ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది.

19 Replies to “బూతు వీడియోలతో టీవీ ఛానల్స్ అత్యుత్సాహం!”

  1. మరి నువ్వు హీరొయిన్ ల అంగాంగ ప్రదర్సన చెసె నగ్న photo లు ఎందుకు వెస్తున్నావు?

  2. parents ki leni baadha vellaki ekkuva ayipoyindi. why is media so worried about this case when parents themselves are not coming to the college and demanding justice. Kootami will do necessary justice for that college.

  3. When parents themselves are not interested then why is media so worried about this case when parents themselves are not coming to the college and demanding justice. Kootami will do necessary justice for that college.

  4. When parents themselves are not interested then why is media so worried. Parents themselves are not coming to the college and demanding justice then why do over action. Kootami will do what is necessary. Just keep quiet.

  5. “ఆడపిల్లల జీవితాలను అతలాకుతలం చేసే ఘటనపై సర్కార్ కఠిన చర్యలు చేపట్టాలి” గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ‘పోర్న్ పార్టీ ల0గా జగన్ రియాక్షన్ ఇది. ఆడపిల్లల భద్రత విషయంలో సర్కార్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలని డిమాండ్ చేసిన ల0గా జగన్..బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వాని విషయంలో మాత్రం ఎందుకు మౌనం వహిస్తున్నారు..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

  6. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో ఏం జరిగిందో కానీ.. అక్కడ చదువుకుంటున్న ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంపై మరక వేసేశారు. సీక్రెట్ కెమెరాలు పెట్టి వారి న్యూడ్ వీడియో తీసి అమ్ముకున్నారన్న ప్రచారం ప్రారంభించేశారు.

    నిజానికి అక్కడ ఒక్కటంటే ఒక్క సీక్రెట్ కెమెరానూ కనిపెట్టలేదు. అలాగే.. కాలేజీ విద్యార్థులు… అనుమానితుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు మొత్తం జల్లెడపట్టినా ఒక్క వీడియో కూడా లేదు. పోలీసులు ఇదే విషయాన్ని ప్రకటించి ఎవరూ భయపడవద్దని ప్రకటించారు. కానీ విద్యార్థుల రూపంలో కొంత మంది.. రాజకీయం కోసం మరికొంత మంది.. సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసేశారని.. ప్రచారం చేశారు. దీని వల్ల ఎవరికి నష్టం ?.

    గుడ్ల వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ప్రతి ఒక్క ఆడపిల్ల మానసిక క్షోభ అనుభవించాల్సిందేనా??. వారి జీవితాలపై అదో మరకగా పడిపోతుంది. డిజిటల్ ప్రపంచంలో ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరంగా మారాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వారంతా ఈ మహమ్మారి బారిన పడాల్సి వస్తుంది. అలాంటివి వారి భవిష్యత్ జీవితాలను నాశనం చేయకుండా.. ఎక్కడిక్కడ పరిష్కారం చేయాలి.. దారి తప్పే విద్యార్థులను కట్టడి చేయాలి. కానీ తమ భవిష్యత్ గురించి ఆలోచించకుండా.. రాజకీయం చేస్తున్నారని తెలిసి కూడా ఆ విద్యార్థులు రోడ్డున పడితే వాళ్లకే నష్టం.

    ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు అదే జరిగింది. తప్పు చేసిన వారు నలుగురు ఐదుగురే.. అది వారి వ్యక్తిగత వ్యవహారశైలి వల్ల వచ్చింది. కానీ చేసిన ప్రచారం మాత్రం అందరి విద్యార్థుల జీవితాలను రిస్క్ లో పెడుతోంది. శవాల మీద రాజకీయం చేయడానికి ఎదురుచూసే పార్టీలు ఉన్న రోజుల్లో.. విద్యార్థుల భవిష్యత్ ను.. వ్యక్తిత్వాలను పణంగా పెట్టడానికి పెద్దగా ఆలోచించవు. తాము బలి పశువులం కావాలా.. భవిష్యత్‌ను కాపాడుకోవాలా అన్నదే విద్యార్థుల విచక్షణ.

  7. కాదంబరి, సంజన, సుకన్య, శాంతి, దువ్వాడ వాణి , గంట అరగంట అమ్మాయిలు, గోరంట్ల బాధితురాలు ఆడవాళ్ళు కాదా జెగ్గులూ?? వాళ్ళకి నువ్వేం న్యాయం చేశావ్ రా లాడంగి??

  8. ఆడది శరీరాన్ని control చేసుకుంటుంది

    మనసుని మాత్రం control చేసుకోలేదు

    కొంచెం మంచిగా మాట్లాడితే నమ్మేస్తుంది

    మగాడు మనసుని control చేసుకుంటాడు

    శరీరాన్ని మాత్రం control చేసుకోలేడు

    కొంచెం పైట జారిస్తే లొంగిపోతాడు

    ..కానీ TV9 కి మాత్రం అన్ని ఆత్రమే ..

Comments are closed.