రెండవ వైపు చూడమంటున్న బొత్స మాస్టారు

ఎంతసేపూ ప్రభుత్వం మీద విమర్శలేనా అంటున్నారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం విద్యా శాఖకు ఎంత మేలు చేసింది ఎన్ని నిధులు కేటాయించింది ఎన్ని సంస్కరణలు తెచ్చింది చూడమంటున్నారు. గతంలో ఎపుడైనా…

ఎంతసేపూ ప్రభుత్వం మీద విమర్శలేనా అంటున్నారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. తమ ప్రభుత్వం విద్యా శాఖకు ఎంత మేలు చేసింది ఎన్ని నిధులు కేటాయించింది ఎన్ని సంస్కరణలు తెచ్చింది చూడమంటున్నారు. గతంలో ఎపుడైనా ఇలా జరిగిందా అని ప్రశ్నిస్తున్నారు.

విద్యారంగం మీద ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధకు ఇది నిదర్శనం అంటున్నారు. విశ్వవిద్యాలయాలలో వేలాది ఖాళీలు ఉంటే గత ప్రభుత్వం భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. మూడు వేల 200 కి పైగా పోస్టులను తమ ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేస్తోందని ఆయన తెలిపారు

ఏ రోజు అయినా ప్రభుత్వ స్కూల్స్ ముందు నో సీట్ బోర్డులను చూశారా అని బొత్స ప్రశ్నిస్తున్నారు. ఆ ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. ప్రైవేట్ విద్య కంటే ధీటుగా సర్కార్ బడులలో చదువు చెబుతున్నామని ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలో సీట్లకు డిమాండ్ పెరిగిందని అన్నారు.

ఏపీలోని విద్యారంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను తెచ్చిన సంస్కరణలను పరిశీలించాలని దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు నీతి అయోగ్ సూచించిందని ఆయన గుర్తు చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషలను బోధించడం పట్ల కేంద్ర ప్రభుత్వమూ మెచ్చుకుందని అన్నారు.

కేవలం టెక్నికల్ రీజన్స్ వల్ల టీచర్లకు జీతాలు కొంత లేట్ అయితే దాని మీద విమర్శలు చేస్తున్నారు అని ఆయన ఫైర్ అయ్యారు. మంచిని మంచిగా చూడాలని కోరుతున్నారు. బొత్స రెండవ వైపు చూడమని కోరుతున్నారు కానీ విపక్షం పాత్ర ఎపుడూ లోటుపాట్లను చూడడమే కదా మాస్టారూ అంటున్నారు. 

విద్యా శాఖ మంత్రిగా బొత్స తమ విజయాలను చెప్పుకోవడంలో తప్పు లేదు అదే సమయంలో విపక్షాల విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని గురువులకు సంతోషం కలిగించేలా జీతాలు కూడా సకాలంలో వచ్చేలా చూడాలి కదా అంటున్నారు.