ముందే ప్యాకప్ అయిన లోకేష్ ఫుల్ ఖాళీగా మరీ..!

పాదయాత్ర అలుపెరగని బాటసారి అని తెగ బిల్డప్ ఇచ్చిన యువ లోకేశం తీరా అనుకున్న షెడ్యూల్ చెప్పిన మాటలు అన్నీ మరచి విశాఖతోనే పాదయాత్రకు చాప చుట్టేసి ముందే ప్యాకప్ అయిపోయారు కదా అంటోంది…

పాదయాత్ర అలుపెరగని బాటసారి అని తెగ బిల్డప్ ఇచ్చిన యువ లోకేశం తీరా అనుకున్న షెడ్యూల్ చెప్పిన మాటలు అన్నీ మరచి విశాఖతోనే పాదయాత్రకు చాప చుట్టేసి ముందే ప్యాకప్ అయిపోయారు కదా అంటోంది వైసీపీ. శ్రీకాకుళం అన్నారు, ఇచ్చాపురం దాకా పాదాలు కదుపుతామని అన్నారు. తీరా చూస్తే రెండు జిల్లాల ముందే కాళ్ళు ముడిచేసింది ఎవరో అంటోంది వైసీపీ.

బాగా ఖాళీగా ఉండి ట్వీట్లు వేస్తున్న లోకేష్ కి మరో డెబ్బై రోజులలో ఒరిజినల్ బొమ్మ ఏంటో అర్ధం అయి పొలిటికల్ సినిమా మొత్తం కళ్ళ ముందు కనిపిస్తుందని అంటున్నారు. ఆగు లోకేష్ కేవలం డెబ్బై రోజులే తొందర ఎందుకు ఎవరు ప్యాకప్పో ఎవరు మ్యాకప్పో జనాలు తేలుస్తారు కదా అని అంటూ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు పేల్చారు

బీజేపీకి వైసీపీకి తేడా ఏంటో బొత్స చెప్పారు. తాము మూడు రాజధానులు అంటే బీజేపీ అమరావతికి జై కొట్టిదని షర్మిల కామెంట్స్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టింది చంద్రబాబు అయితే ఆయన్ని అడగడం మానేసి మామీద నిందలా అని ఆయన షర్మిల మీద ఫైర్ అయ్యారు.

ఓటు లేని వ్యక్తులు ఈ రాష్ట్రంలోకి వచ్చి రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధం లేని వాళ్ళు ఉద్దరిస్తాం అంటే జనాలు నమ్ముతారా అని ఆయన ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్నే కాదు ఉతరాంధ్రా ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత సీఎం జగన్ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

ఎవరో ఏదో అన్నారన్నది పట్టించుకోం, ప్రజల సంక్షేమమే మాకు పరమావధి అని బొత్స అన్నారు. అందుకే ఈ నెల 27న ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ కేడర్ ను సమాయాత్తం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని బొత్స తెలిపారు. ఏపీలో ఉన్న దుష్ట శక్తులను ఎదుర్కోవాలో ఈ సభలో క్యాడర్ కి చెప్తారని బొత్స అన్నారు.

అంతే కాకుండా ఈ నాలుగున్నర ఏళ్లల్లో ఎంత అభివృద్ధి చేసాం, ఎంత సంక్షేమం చేశామో పార్టీ కేడర్ కు తెలియ చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి జగన్ మాటగా చెబుతున్నాం, మేము చేసిన మంచిని చూసే మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి అని జగన్ అన్నారు. అదే మా నినాదం అన్నారు. దేశంలో ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుణ్ణి ఇలా చెప్పడం చూడలేదని బొత్స అన్నారు. అదే మా ధైర్యం మా ధీమా అని అన్నారు.