పెద్దన్న పాత్రలో బొత్స

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. ఈ సీటు కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. చివరి నిముషంలో వచ్చిన టీడీపీ అభ్యర్ధి గట్టిగా పోటీ ఇచ్చి ఓట్లు చీల్చి వైసీపీకి మేలు చేకూరుస్తాడు…

ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. ఈ సీటు కచ్చితంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. చివరి నిముషంలో వచ్చిన టీడీపీ అభ్యర్ధి గట్టిగా పోటీ ఇచ్చి ఓట్లు చీల్చి వైసీపీకి మేలు చేకూరుస్తాడు అనుకుంటే వైసీపీనే సెకండ్ ప్లేస్ లోకి నెట్టి గెలిచేశారు.

దీని మీద వైసీపీలో అయితే మధనం జరుగుతోంది. ఓటమి ఎందుకు వల్ల సంభవించింది ఎందుకు ఇలా జరిగింది అన్న దాని మీద ఎవరి మటుకు వారు చర్చించుకుంటూ వచ్చారు. సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఓటమికి నేను బాధ్యత వహిస్తాను అంటూ సంచలన ప్రకటన చేశారు.

ఈ ఓటమికి కారణాలు ఎన్నో ఉన్నా నేను మాత్రం నా ఓటమి కిందనే తీసుకుంటాను అని  చెప్పారు. వైసీపీ గెలవాలని నేను ఎంతో గట్టిగా కృషి చేశానని ఫలితం వేరేగా వచ్చిందని ఆయన అంటున్నారు. అయినా సరే ఎవరో ఒకరు బాధ్యత వహించాలి కాబట్టి అది నేనే అని ఆయన చెప్పుకొచ్చారు.

బొత్స బాధ్యత వహించడం అంటే ఒకే కానీ ఈ ఓటమి బాధ్యతకు ఆయన ఏ విధంగా పరిహారం చెల్లిస్తారు అన్నది సొంత పార్టీ నుంచి బయట నుంచి వస్తున్న ప్రశ్నలు. సాధారణంగా బాధ్యత తీసుకున్న వారు తమ పదవులకు రాజీనామా చేస్తారు. బొత్స మాత్రం తాను ఓటమికి బాధ్యత వహిస్తాను ఇలాంటి వాటి నుంచి నేను పారిపోయే రకాన్ని కాదు అంటున్నారు.

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ అధినాయకత్వమే లైట్ గా తీసుకున్న నేపధ్యంలో బొత్స ఈ కామెంట్స్ చేయడం ద్వారా ఉత్తరాంధ్రా వైసీపీకి పెద్ద్దన్నగా ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఉత్తరాంధ్రాలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి నూరు శాతం సీట్లను గెలిపించి ఫలితాలను బొత్స తీసుకురాగలరా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 

బొత్స మాత్రం ఉత్తరాంధ్రాకు తానే పెద్ద దిక్కుగా చెప్పుకునే ప్రయత్నంలోనే ఇలా మాట్లాడుతున్నారని, అధినాయకత్వం అసలు ఓటమిని సీరియస్ గా తీసుకుంటే కదా బొత్స బాధ్యతకు విలువ పెరిగేది అని అంటున్నారు.