ఏపీలో మూడు చాన‌ల్స్ ప్ర‌సారాల బంద్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా మూడు టీవీ చాన‌ల్స్ ప్ర‌సారాల‌పై అన‌ధికార నిషేధం విధించింది. ప్ర‌తిప‌క్ష వైసీపీకి అనుకూల చాన‌ల్స్ అనే కార‌ణంతో ఎన్ టీవీ, టీవీ9, సాక్షి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం మీడియాపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా మూడు టీవీ చాన‌ల్స్ ప్ర‌సారాల‌పై అన‌ధికార నిషేధం విధించింది. ప్ర‌తిప‌క్ష వైసీపీకి అనుకూల చాన‌ల్స్ అనే కార‌ణంతో ఎన్ టీవీ, టీవీ9, సాక్షి ప్ర‌సారాల‌ను అడ్డుకున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. కేబుల్ ఆప‌రేట‌ర్ల‌ను బెదిరించి, మరీ ప్ర‌సారాల‌ను అడ్డుకున్న‌ట్టు వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేర‌కు ఆ పార్టీ ట్వీట్ చేసింది. అదేంటో తెలుసుకుందాం.

“రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబునాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషించే మీడియాను అణచి వేస్తున్నారు. అధికార దుర్వినియోగం, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు టీవీ చానళ్లపై కక్షకట్టారు. తెలుగువారిలో అత్యంత ప్రజాదరణ పొందిన Sakshi TV, NTV, TV 9 న్యూస్ చానళ్లపై చంద్రబాబు కత్తికట్టారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ చానళ్లు ప్రసారం కాకూడదని హుకుం జారీచేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేబుల్‌ఆపరేటర్లు ఆయా చానళ్ల ప్రసారాలను నిలిపేశారు. రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అధ్యక్షతన కేబుల్‌ ఆపరేటర్లతో సమావేశంపెట్టి మరీ ఈ దారుణాలకు దిగారు. పోలీసు ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ మహేష్‌ చంద్రలడ్డా సహా మరికొందరు అధికారులు ఈ సమావేశంలో పాల్గొనడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ”

కొన్ని రోజులుగా కూట‌మి పాల‌న‌పై వ్య‌తిరేక టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఉచిత ఇసుక ఇస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అస‌లుకే ఎస‌రు పెట్టార‌నే విమ‌ర్శ ఊపందుకుంది. ఇసుక కొనుగోలు కోసం ప్ర‌త్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 108 రీచ్‌ల‌ను కూడా ప్ర‌భుత్వం సిద్ధం చేసింది. బ‌హుశా 16 నుంచి అక్క‌డ అమ్మ‌కాలు మొద‌ల‌వుతాయి.

అలాగే సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌క‌పోవ‌డం, కూట‌మి ఎమ్మెల్యేల దౌర్జ‌న్యాలతో పాటు పాల‌న దారి త‌ప్పింద‌నే ప్ర‌చారం కేవ‌లం నాలుగు నెల‌ల‌కే మొద‌లు కావ‌డం స‌హ‌జంగానే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో ప్ర‌భుత్వ వ్య‌తిరేక వాయిస్ అనేది వినిపించ‌కుండా వుండాల‌నే ప‌ట్టుద‌ల‌తో వారం, ప‌ది రోజులుగా చాన‌ల్స్ ప్ర‌సారాల‌పై వేటు వేయాల‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఎట్ట‌కేల‌కు ఇప్ప‌టికి మూడు టీవీ చాన‌ల్స్ ప్ర‌సారాల‌పై నిషేధం విధించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అధికారం మారిన‌ప్పుడ‌ల్లా కొన్ని టీవీ చాన‌ల్స్ ప్ర‌సారాల‌పై నిషేధం విధించ‌డం తెలుగు స‌మాజంలో ఆన‌వాయితీగా మార‌డం దుర‌దృష్ట‌క‌రం. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టు చాన‌ల్స్ ప్ర‌సారాల‌పై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చిన త‌ర్వాత‌… మ‌ళ్లీ క‌థ మొద‌టికి రావ‌డం గ‌మ‌నార్హం.

31 Replies to “ఏపీలో మూడు చాన‌ల్స్ ప్ర‌సారాల బంద్‌!”

  1. మరి భారతమ్మ అవినాష్ ఆధ్వర్యంలో అబద్దాలతో నడిచే గుడిసేటి యాక్చీ పేపర్ కూడ ఆ లిస్ట్ లో తోసేస్తే శని దరిద్రాలు మొత్తం పోతాయి కదా.. వాళ్లు కూడా చిలకా గోరింకల్లాగా సరస సాయ్యాటలో మునిగి తేలుతారు..

  2. వాల్లు బంద్ చెసెదెముంది… ఇప్పుదు అంత నెట్… ఎ చానల్ ఎవ్వరు ఎక్కదైనా చూడొచ్చు.. జిఒ ఉంటె చాలు మరింత సులభం..

  3. నాకు తెలిసీ ఎన్టీవీ, టీవీ 9 లు ఎవరు అధికారంలో ఉంటె వాళ్లకు భజన చేస్తారు, ఇప్పుడు దాదాపు అదే చేస్తున్నారు. బ్యాన్ చేయడం ఎందుకు?

  4. ప్రియమైన రాజా గారు,

    ఈ మాట అడగక తప్పడం లేదు—మీకు ఎక్కడైనా సిగ్గు మిగిలి ఉందా? ఒకప్పుడు మీకు ఉన్న విద్య, సంప్రాప్తి మీలో పౌరుషాన్ని నింపిందని అనుకున్నాము. కాని ఇప్పుడు మీరు జగన్ మోహన్ రెడ్డికి పావులా ప్రవర్తిస్తూ, వెన్నెముక లేని వ్యక్తిలా అవతరిస్తున్నారు. సూత్రం లేని బొమ్మలా, ఎటువంటి స్వతంత్ర ఆలోచన లేకుండా, ఆయనను అనుకరిస్తూ వెళ్తున్న తీరు చూసి బాధ కలుగుతోంది.

    విద్యావంతులుగా ఉండే ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతను గుర్తించాలి. కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే కాకుండా, అధికారంలో ఉన్నవారినీ ప్రశ్నించడం మీ కర్తవ్యం. ప్రజలు మీపై ఉంచిన బాధ్యతను మీరు మరచిపోయారనిపిస్తోంది. 175 స్థానాలలో 11 మాత్రమే గెలుచుకోవడం మీ “మేధా” స్థాయికి ప్రజలిచ్చిన స్పష్టమైన జడ్జిమెంటు. అదే మీ వాస్తవ స్థితిని మీ ముందుకు తెస్తుంది.

    మరి మీ ఈ అజ్ఞాన భక్తి, మీ అంధ విశ్వాసానికి కారణం ఏమిటి? జగన్ మోహన్ రెడ్డి మారినందుకు? మారడం వ్యక్తిగత హక్కు—ఇందులో సందేహం లేదు. కానీ ఆ మార్పు ఒక్కటే మీ భక్తికి ఆధారమైతే, అది మీ వ్యక్తిత్వం ఎంత తక్కువ స్థాయిలో ఉందో చూపిస్తుంది. మీరు ఒక్క మార్పు కోసం, మీ సూత్రాలు, మీ ప్రశ్నించే సామర్థ్యాలు అన్ని విస్మరించారనిపిస్తోంది.

    రాజా గారు, మీరు విద్యావంతుడిగా ఉండాలని ఆశించిన మనం, ఇప్పుడు మీ వెన్నెముకను చూసే నిరీక్షణలో ఉన్నాం. మనం ఈ స్థాయికి దిగజారిపోవడానికి మీరు కారణం కాదు కదా అనుకుంటున్నాము. ఇప్పటికైనా మీ బాధ్యతలను గుర్తుంచుకొని నిలబడండి. మీ వెన్నెముకకు బలాన్ని చేకూర్చండి.

  5. ప్రియమైన రాజా గారు,

    మీరెప్పుడైనా మీలో కొంచెమైనా సిగ్గు ఉందా అని ఆలోచించారా? మీ విద్యాభ్యాసంతో మీరు ఒక ఆదర్శవంతమైన, సుశిక్షితుడైన వ్యక్తిగా ఉండాలని అనుకుంటాం. కానీ, మీరు అలా ప్రవర్తించకుండా, జగన్ మోహన్ రెడ్డి తీర్మానాలనెరిగి, ఎదుటి వ్యక్తి చెప్పినట్లు ప్రవర్తిస్తూ, మీ స్వంత ఆలోచన లేకుండా ఒక బొమ్మలా మారిపోయారు.

    విద్వాన్‌కి సరైన లక్షణం ఎప్పుడూ బలంగా నిలబడటమే. ప్రతిపక్షాన్ని, అధికార పక్షాన్ని సరియైన సమయంలో ప్రశ్నించగలగడం, అటువంటి సాహసం చేయడం ప్రజల చెంతన మీ బాధ్యత. కానీ, మీరు మాత్రం ప్రజల సమర్థతను పొందినట్టు కాకుండా, ఒక పెద్ద బుద్ధిజీవిలా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు మీ “మేధస్సు”ని చూసి మీకు 175 స్థానాల్లో 11 సీట్లే ఇవ్వడం ద్వారా, ఎంత మంచిగా మీకు గుణపాఠం నేర్పారో తెలుసుకదా!

    ఇక మరొక ముఖ్యమైన విషయం—జగన్ మోహన్ రెడ్డి మార్పుచెందాడనే కారణంతో మీరు అతనికి మద్దతు ఇస్తున్నారు. మార్పు అనేది వ్యక్తిగత హక్కు. కానీ, కేవలం ఆ కారణంతోనే మీరు అంధమద్దతు ఇస్తూ, ప్రశ్నలు అడగకుండా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తించడం ఎంత నీచమో అర్థం చేసుకోండి.

    రాజా గారు, ఎప్పుడైనా మీకు వెన్నెముక ఉందా అంటే ఇప్పుడు చూపించాల్సిన సమయం వచ్చేసింది. ఇది కాదు మిత్రమా, మీరు ఒక సుశిక్షితుడు, మరింత నిలువుగా నిలబడే సమయం.

  6. గ్రేట్ ఆంధ్ర జర్నలిస్ట్ లకు వినతి… మీరు చెప్పినట్టు నిషేదాలు ఉంటే, వాటికి తగిన ఆధారాలతో న్యూస్ ప్రచురించండి. ఇప్పటివరకు మీరు చెప్పిన న్యూస్ చానెల్స్ ఏవి కూడా నిషేదింపబడలేదు. వ్యక్తిగతంగా నేను రోజుకి 6 ఛానెల్స్ న్యూస్ ని 2 గంటలు చూస్తున్నాను. ప్రజలకి అన్నీ తెలుసు. మీరు అసత్య ప్రచారాలు మానుకోండి. 🙏

    1. రాజమండ్రి లో గత 3 రోజులు నుంచి (14/10/2024) ఈ మూడు ఛానళ్ళ ప్రసారాలు ఆపివేయబడ్డాయి

Comments are closed.