నోరు ఉంది కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడంలో టీడీపీ సీనియర్ నేతల్లో బుద్ధా వెంకన్న ముందు వరుసలో ఉంటారు. సొంత పార్టీ వారిపై విమర్శలు చేస్తూ, ప్రత్యర్ధి పార్టీలపై తొడలు కొట్టడంలో సిద్దహస్తుడు, తన పార్టీ వారు పట్టించుకోకపోతే ఏడ్చే బుద్దా వెంకన్న ఇవాళ మీడియా సమావేశంలో తమ పార్టీ అధినేతకు సన్నిహితుడు పవన్ కళ్యాణ్ పై సానుభూతి వ్యక్తం చేశారు.
పవన్ విశాఖ ఎయిర్ పోర్టుకి వచ్చే సమయంలో ప్రత్యక్షి సాక్షి నంటూ మీడియా ముందుకు వచ్చారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అసలు ఎయిర్ పోర్ట్ దగ్గర జనసేన కార్యకర్తలు చాలా హుందాగా ప్రవర్తించరాని జనసైనికులు చాల మంచి వారు అంటూ సర్టిఫికెట్ ఇచ్చారు.
విశాఖ ఎయిర్ పోర్టు దగ్గర ఘర్షణకు కారణం మంత్రులే అంటూ, జనసేన కార్యకర్తలను మంత్రులు రెచ్చగొట్టినా వారు హుందాగా వ్యవహరించారన్నారు. ఏదైనా చిన్న ఘర్షణ జరిగి ఉండవచ్చునని దాన్ని చూపిస్తూ జనసేన కార్యకర్తలను అరెస్టు చేయడం తప్పన్నారు. ఎయిర్ పోర్టు దగ్గర జరిగిన ఘటన సిసి ఫుటేజిని ఎడిటింగ్ చేసి చూపిస్తున్నారని అరోపించారు. పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని వైసీపీ మంత్రులు అంటున్నారని, జగన్‌లా చంద్రబాబు అవినీతిపరుడుకాదని, బాబు దగ్గర అవినీతి సొమ్ము లేదన్నారు. అలాగే పవన్ కూడా అవినీతి రాజకీయ నాయకుడు కాదని బుద్దా వెంకన్న సర్టిఫికెట్ ఇచ్చారు.
అలాగే తను రోజూ మాట్లాడినట్లే విజయసాయి రెడ్డి, సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఎంత సేపూ టీడీపీ అను'కూల' మీడియాలో తమను చూపిస్తున్నారంటూ మాట్లాడటం తప్పా ప్రజల్లోకి వెళ్లి పార్టీ కోసం కష్టపడే నేతలు లేరంటూన్నారు టీడీపీ కార్యకర్తలు.