విశాఖలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తన పార్టీ కార్యకర్తలు చేసిన హడావుడికి జనసేన పార్టీకి రాజకీయంగా బలం వచ్చిందో లేదో కానీ నోట పార్టీ నేతలు మాత్రం క్యూ కడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై సానుభూతి చూపిస్తున్నారు నిన్న ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జనసేన అధినేతను కలిసి తన సానుభూతిని తెలిపారు. అలాగే ఇతర పార్టీ నేతలు కూడా విజయవాడలో తను బస చేసే హోటల్ కు వచ్చి సానుభూతి తెలుపుతున్నారు.
అందరూ వచ్చి సానుభూతి తెలుపుతున్న… పవన్ కు అత్యంత సన్నిహితుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిసి తన సానుభూతి తెలియజేస్తారా లేదా అందరి నుండి వస్తున్నా ప్రశ్నలు. ఎందుకంటే ఇతర పార్టీలకు పవన్ అవసరం కంటే చంద్రబాబుకు తన పార్టీకి చాల అవసరం.
అందుకే తర్వలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిసి తన సానుభూతి వ్యక్తం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్న చంద్రబాబు పవన్ ను కలిసి తప్ప కూడా సానుభూతి చూపిస్తారు అనేది నిజం అంటున్నారు చంద్రబాబు రాజకీయం తెలిసినవారు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను కలిస్తే మాత్రం పొత్తులు దాదాపు ఓకే అయినట్లు భావించాల్సి వస్తుందంటూన్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే టీడీపీ- జనసేన పొత్తునా, లేక టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తునా అనేది మాత్రం ముందు ముందు చూడాలంటున్నారు.