ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయిన తర్వాత టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్నకు దిక్కుతోస్తున్నట్టు లేదు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ గుడ్ లుక్స్‌లో పడేందుకు బుద్దా పడరాని పాట్లు పడుతున్నారు. బాబు, లోకేశ్‌లకే కాదు, బీసీలంతా దేవాన్ష్‌కు కూడా బానిసత్వం చేస్తామని ప్రకటించి అభాసుపాలయ్యారు. నిజానిజాలతో సంబంధం లేకుండా బాబు, లోకేశ్‌ల మెప్పుకోసం బుద్దా ఏదేదో వాగుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవాళ ఆయన సంచలన ఆరోపణ చేశారు. చంద్రబాబు, లోకేశ్‌కి ప్రాణహాని వుందని ఆయన తీవ్ర ఆరోపణ చేయడం గమనార్హం. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోడానికే జీవో నంబర్-1 తీసుకొచ్చారని విమర్శ చేశారు. బుద్దా కామెంట్స్‌పై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి. ఇంటి పేరులోనే తప్ప, బుర్రలో అది లేనట్టుందని వెంకన్నపై నెటిజన్లు వ్యంగ్య కామెంట్స్ చేయడం గమనార్హం.
చంద్రబాబు, లోకేశ్ జనంలోకి వెళ్లి వారిని చంపుతున్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతుంటే, తండ్రీకొడుకుల్ని ఏదో అవుతుందని బుద్దా వెంకన్న విమర్శలు చేయడం విడ్డూరంగా వుందనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడ్డానికే జీవో నంబర్ -1 ప్రభుత్వం తీసుకొచ్చిందనే విషయాన్ని గుర్తించాలని అధికార పార్టీ నేతలు హితవు చెబుతున్నారు.
తండ్రీకొడుకులతో పాటు దేవాన్ష్‌ను కాక పట్టడం స్థాయికి బుద్దా దిగజారారంటే… ఆయన మానసిక స్థితి ఏంటో అర్థమవుతోందని విమర్శలొస్తున్నాయి. బుద్దాను ఇట్లే విడిచిపెడితే… ఇంకా ఏం మాట్లాడ్తారో అనే ఆందోళన కలుగుతోందని, మొదట ఆయనకు మంచి వైద్యుడి వద్ద చూపించాలనే ఉచిత సలహాలు కూడా కొందరు ఇస్తున్నారు.