పడితే పులినే పట్టాలి…

అవుని అది పెద్ద పులి. ఏకంగా స్వైర విహారమే చేస్తోంది. అదీ ఇదీ కాదు ఆ ఊరూ ఈ ఊరూ నాదేనంటోంది. గోదావరి జిల్లాల నుంచి పది రోజుల క్రితం వచ్చిపడిన పెద్ద పులి…

అవుని అది పెద్ద పులి. ఏకంగా స్వైర విహారమే చేస్తోంది. అదీ ఇదీ కాదు ఆ ఊరూ ఈ ఊరూ నాదేనంటోంది. గోదావరి జిల్లాల నుంచి పది రోజుల క్రితం వచ్చిపడిన పెద్ద పులి ఉమ్మడి విశాఖ జిల్లాలో హల్ చల్ చేస్తోంది. పెద్ద పులి దెబ్బకు పశువులు రోజుకొకటిగా ఆహారం అయిపోతున్నాయి.

ఈ మధ్యలో రెండు మూడు సార్లు జాతీయ రహదారిని దాటుతూ అలా సడెన్ గా కార్ల మీద వెళ్లేవారి కంటబడి వారి గుండాగేలా చేసింది. ఇక ఇదిగో అనకాపల్లిలో నిన్నటికి కనిపించింది అంటే ఈ రోజుకీ చోడవరంలో పంజా విసురుతోంది.

లక్కీ ఏంటి అంటే ఇప్పటిదాకా మనుషులు ఎవరూ దానికి ఎదురుకాలేదు, ఎర కాలేదు. విశాఖ జిల్లా అటవీశాఖ అధికారులు అయితే మాటు వేసి పెద్ద పులిని కనిపెట్టి పనిపట్టాలని చూస్తున్నారు కానీ అది ఊళ్ళకు ఊళ్ళూ నడుస్తూ ఉన్న చోట ఉండకుండా నానా ఇబ్బందులు పెడుతోంది.

ఇంకో వైపు జిల్లాలోని గ్రామస్తులు అయితే చీకటి పడితే చాలు బయటకెళ్లడం మానేసి పెద్ద పులి భయంతో జడుపు జ్వరం పెట్టుకుంటున్నారు. తొందరగా ఈ పులిని పట్టి తమకు విముక్తి కలిగించాలని అధికారులను కోరుతున్నారు. మరి పడితే పులినే పట్టాలి అంటూ యువత కూడా దాని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. 

కానీ ఈ పులి జూదం కడు భయంకరం, ప్రమాదరకంగా మారింది. జిల్లాకు జిల్లాయే ఇలా పులి మీద స్వారీ చేస్తున్న వేళ ఎపుడు టైగర్ చిక్కేనో, ట్రబుల్స్ ఎపుడు తప్పేనో అన్నదే జనం బాధ.