చంద్రబాబునాయుడుకు తన ఫోటో ఒక్కరోజు పేపర్లో కనిపించకపోయినా సరే.. రాష్ట్ర ప్రజలు తనను మరచిపోతారని చాలా భయం. అందుకే.. ఎన్నికల పోలింగు ముగిసి.. ఫలితాలు వెలువడడానికి ముందు ఉన్న ఖాళీలోని విరామ సమయాన్ని విహారయాత్రల్లో కుటుంబం సహా గడపడానికి ఆయన అమెరికా వెళ్లారు. వెళ్లినాసరే.. అక్కడకూడా ఆయన కుదురుగా ఉండలేకపోతున్నారు.
ఇక్కడ రాష్ట్రప్రభుత్వంలో ఏ చిన్న పరిణామం జరుగుతున్నా సరే..అందులో లోపాలు వెతికి, లేదా, లోపాలుగా రంగు పులుముతూ.. జగన్ ప్రభుత్వం తప్పులు చేసేస్తున్నదని బురద చల్లాలనే లక్ష్యంతోనే బతుకుతున్నారా? అనిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వంలో ఐఏఎస్ ల కన్ఫర్మేషన్ ప్రక్రియ జరుగుతుండగా.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆ ప్రక్రయిను వాయిదా వేయాలంటూ.. యూపీఎస్సీకి తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఒక లేఖ రాశారు. ప్రభుత్వం పరిపాలన క్రమంలో భాగంగా రొటీన్ గా జరిగిపోయే ప్రక్రియే ఐఏఎస్ ల కన్ఫర్మేషన్! అయితే దీనికి కూడా చంద్రబాబునాయుడు అడ్డం పడుతున్నారు.
అమెరికాలో కుటుంబం సహా విహార యాత్రలో ఉన్న ఆయన ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియ వాయిదా వేయాలంటూ లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం వచ్చేవరకు ఆపాలట. సీఎంవోల వారికి మాత్రమే పదోన్నతులు పరిమితం చేసేశారట. ఆ రకంగా ఈ ప్రక్రియలో తప్పులు దొర్లుతున్నట్టుగా జగన్ కు బురద పులమడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
కొత్త ప్రభుత్వం అంటే తానే ముఖ్యమంత్రిగా వచ్చేస్తానని చంద్రబాబు కలలు కంటున్న్నట్టుగా ఉంది. తాను వచ్చిన తర్వాత.. జగన్ వద్ద పనిచేసిన ఏ అధికారికీ ఐఏఎస్ కన్ఫర్మేషన్ రాకుండా అడ్డుపడే ఆలోచనతోనే చంద్రబాబు విదేశాల్లో ఉండి కూడా ఇక్కడి కుట్రలు నడిపిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.