నాలుగేళ్ల పరిపాలన పూర్తయిందని, తననేం పీకావని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సీఎం చంద్రబాబునాయుడు పదేపదే రెచ్చగొట్టారు. తనను అరెస్ట్ చేయడం జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే కాలేదని, ఇతనేం చేయగలడని ప్రగల్భాలు పలికారు. చివరికి ఏమైందో అందరికీ తెలుసు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా అతడు సినిమాలో ఓ కామెడీ సీన్ తెగ వైరల్ అవుతోంది. కమెడియన్ బ్రహ్మానందాన్ని హీరో మహేశ్‌బాబు కొట్టిన సీన్.. చంద్రబాబును వైఎస్ జగన్ కొట్టినట్టు కొన్ని కల్పిత వీడియోలు పుట్టుకొచ్చాయి. అతడు సినిమాలో ఆ సీన్‌కు సంబంధించి కామెడీ సన్నివేశంలో ఏముందంటే…
బ్రహ్మానందానికి తాను చాలా బలమైన వ్యక్తిననే భ్రమలో వుంటారు. ఒక బస్తాను అలవోకగా పక్కకు విసిరేస్తాడు. మీకు చాలా బలం వుందే అని పిల్లలు అంటారు. బ్రహ్మానందం మురిసిపోతాడు. తన పొట్టపై కొట్టాలని పిల్లల్ని అడుగుతారు. వద్దని వాళ్లంటారు. కానీ వినిపించుకోడు. ఒక పిల్లాడు బ్రహ్మానందం పొట్టపై కొట్టి, చేయి నొప్పి పెట్టిందని బాధతో అరుస్తాడు.
ఆ సమయానికి అటుగా హీరో మహేశ్‌బాబు వస్తాడు. ఏంటి నువ్వు కొడ్తావా, కొట్టు అని మహేశ్‌బాబును బ్రహ్మానందం అడుగుతాడు. కమాన్ హిట్ యా అని రెట్టించి అడుగుతాడు. బాబాయ్ వద్దంటూ హీరోయిన్ త్రిష పరుగునా వచ్చి వేడుకుంటుంది. వాన్ని నేను కొట్టడం లేదమ్మా. వాన్నే నేడు కొట్టమంటున్నా అని సరద్ది చెబుతాడు.
కొట్టకుండా వెళుతున్న హీరో మహేశ్‌బాబును ఆడ్డగించి మరీ… కొట్టవయ్యా అని బ్రహ్మానందం అడుగుతాడు. వద్దండి అని మహేశ్‌బాబు ముందుకెళుతుంటాడు. ఏం సిగ్గా, భయమా, గౌరవమా అంటూ బ్రహ్మానందరం రెచ్చగొడతాడు. కొట్టకుండా వెళుతున్న హీరోను అడ్డుకుని జాలి చూపుతున్నావా? అంటాడు. ఇది రాయి అంటూ తన పొట్ట గురించి చెబుతాడు. దీంతో బ్రహ్మానందం పొట్టపై హీరో మహేశ్‌బాబు ఒక్క దెబ్బ వేస్తాడు. అంతే సంగతులు. చంద్రబాబు కూడా ఊరికే రెచ్చగొట్టి జగన్ చేతిలో చావు దెబ్బ తిన్నాడనే చర్చకు తెరలేచింది.