గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కు తెలిసిన ఆట పొలిటికల్ ఫుట్‌బాల్ అని చెప్పుకొచ్చారు. మూడు రాజధానులపై డిబేట్లు జరగకూడదని, ముగ్గురు పెళ్లాలపై జరగాలని వ్యంగ్యంగా అన్నారు. ఉత్తరాంధ్ర ఆకాంక్ష గురించి లోకానికి తెలియకూడదని పవన్‌కల్యాణ్‌తో చంద్రబాబు గేమ్ ఆడించారన్నారు.
విశాఖ ఎపిసోడ్ మొదలు, విజయవాడలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నారని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబు దృష్టిలో రైతులంటే 29 గ్రామాలకు చెందిన 33 వేల ఎకరాల యజమానులు మాత్రమే అని విమర్శించారు. తెలుగుదేశానికి జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు, లోక్‌సత్తా పార్టీలు గడ్డి పెట్టాలని సూచించారు. సీఎంను పిల్లినాకొడుకు అంటే వీళ్లెవరూ మాట్లాడరని ధ్వజమెత్తారు. సీఎంను తిడితే, తాము స్పందిస్తే వెంటనే కొందరు మీడియా ముందుకొచ్చి నీతులు చెబుతారని వెటకరించారు.
సీఎంకు చెప్పు చూపితే ఏమనాలి ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బూతుల స్కూల్ పెట్టారని అన్నారు. దానికి అయ్యన్న పాత్రుడిని ప్రిన్సిపాల్‌గా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్నపాత్రుడి ఆధ్వర్యంలో బూతులు నేర్పిస్తూ, తమపై ఉసిగొల్పుతున్నారని విరుచుకుపడ్డారు.
జగన్ పబ్జీ ఆడాడని విమర్శించడంపై కొడాలి ఘాటుగా స్పందించారు. సీఎం సెల్ఫోన్లో మాట్లాడుతున్న వీడియో లేదా ఫొటో ఎవరైనా చూపగలరా? అని ప్రశ్నించారు. ఎవరూ చూపించలేరని, ఎందుకంటే ఆయన ఫోన్ ముట్టుకోరన్నారు. పొలిటికల్ ఫుట్‌బాల్ ఆడడం మాత్రమే జగన్‌కు తెలుసన్నారు.