భోగాపురం సాక్షిగా బాబుకు చేదు మాట

చంద్రబాబునాయుడు ఎన్నికలు పెట్టడమేంటి ఇలా ఏపీకి సీఎం తానే అని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆయన దృష్టిలో ఎన్నికలు అన్నవి కేవలం లాంచనమైన ప్రక్రియగానే  ఉన్నాయి. జగన్ని ఎన్నుకుని జనాలు తప్పు చేశారని డే…

చంద్రబాబునాయుడు ఎన్నికలు పెట్టడమేంటి ఇలా ఏపీకి సీఎం తానే అని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఆయన దృష్టిలో ఎన్నికలు అన్నవి కేవలం లాంచనమైన ప్రక్రియగానే  ఉన్నాయి. జగన్ని ఎన్నుకుని జనాలు తప్పు చేశారని డే వన్ నుంచి బాబు ఒక్కటే మైండ్ సెట్ తో ఉన్నారు. అదే నిజమని క్యాడర్ ని నమ్మిస్తున్నారు. జనాలకూ అదే చెబుతున్నారు.

ఈ మధ్య దాకా ముందస్తు ఎన్నికలు అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఆయన తమ్ముళ్ళు ఇపుడు 2024లోనే ఎన్నికలు అని ఫిక్స్ అయ్యారు. ఒక ఏడాది పాటు ఓపిక పట్టాల్సిందే అని డిసైడ్ అయ్యారు. ఏముంది 2023 క్యాలెండర్ వేగంగా గడిస్తే  2024లో ఓట్ల పండుగ రానుంది. గెలుపు ఖాయమని బాబు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

జగన్ కూడా అంతే నమ్మకంతో చెబుతున్నారు. బాబు ఇంకా 2023లో ఉంటూ 2024 గురించి ఆలోచిస్తూంటే జగన్ 2026 దాకా వెళ్లిపోయారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయాంకి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి అదే సభలో ఒక భరోసాతో కూడిన హామీని జనాలు ఇచ్చారు.

ఈ రోజున శిలాఫలకానికి శంకుస్థాపన చేస్తున్నామని, 2026లో తానే వచ్చి భోగాపురం ఎయిర్ పోర్టుని ప్రారంభిస్తాను ఇదే సత్యం అని గట్టిగా ఒట్టేసి మరీ చెప్పేశారు. తాను ఎంతో ప్రయాసపడి భోగాపురం విమానాశ్రయానికి అన్ని అనుమతులు సంపాదించానని, నిర్వాసితులకు ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతోందని, భూ సేకరణ ఇబ్బందులు కోర్టు కేసులు క్లియర్ చేయించగలిగామని, ఎన్జీటీ అనుమతులు అన్నీ పూర్తిగా తెచ్చున తరువాతనే ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టు కి ఎన్నికలు రెండు మూడు నెలలలో ఉన్నాయనగా టెంకాయ కొట్టి జనాలను మోసం చేయడం కాదని చంద్రబాబుని ఎద్దేవా చేశారు. ఏ అనుమతీ లేకుండా శంకుస్థాపన చేశామంటే కుదురుతుందా బాబు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే జగన్ 2024 గురించి కాదు 2025లో శ్రీకాకుళంలో పోర్టుకు, 2026లో భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం హోదాలో ప్రారంభోత్సవం చేయడానికే రెడీ అవుతున్నారు. మరి 2024 ఎన్నికలు  రిజల్ట్స్ మాటేంటి అని తమ్ముళ్ళు ఎవరైనా డౌట్ పడితే జగన్ ప్రసంగంలోనే జవాబు వెతుక్కోవాల్సిందే అంటున్నారు.