నాయకుడు ఒక మాట చెబితే దానికి ఒక విలువ ఉండాలి. నాయకుడు హూంకరిస్తే అందరూ భయపడాలి. ఆయన మాటలకు అనుగుణంగా తమకు ఇష్టం లేకపోయినా నడుచుకోవాలి. అలా జరక్కపోతే సదరు వ్యక్తి యొక్క నాయకత్వ లక్షణాల్ని అనుమానించాల్సిందే.
చంద్రబాబునాయుడు విషయంలో ఇప్పుడు అలాంటి అనుమానాలే కలుగుతున్నాయి. ఆయన తెలుగుదేశం పార్టీకి అధినేత! రాష్ట్రానికి ముఖ్యమంత్రి! కానీ ఆయన మాటను పట్టించుకుంటున్న వారు ఎందరు? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ‘తప్పు చేశారంటే నేను ఊరుకోను.. కఠిన చర్యలుంటాయి’ అని చంద్రబాబునాయుడు అన్నారంటే.. అది ఒక కామెడీ డైలాగులాగా ప్రజలకు కనిపిస్తోంది. అసలు ఆయన మాటలను ఖాతరు చేస్తున్న వ్యక్తులే కనిపించడం లేదని నవ్వుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు సరికొత్త లిక్కర్ విధానం తీసుకువచ్చిన తరువాత.. ఆ రంగం అనేక రకాలుగా భ్రష్టుపట్టిపోయిన సంగతి తెలిసిందే. నిర్దిష్టమైన ఫీజులు తీసుకుని ప్రెవేటు వ్యాపారులకు అప్పగించేశారు. ఇక ప్రెవేటు వ్యాపారలు అడ్డగోలుగా అమ్మకాలు సాగించి లాభాలు గడించడం మీదనే దృష్టి పెడుతుంటారు. ఆ క్రమంలోనే బెల్టు షాపులు కూడా పుట్టగొడుగుల్లాగా పుట్టుకువస్తున్నాయి. బెల్టుషాపులకు కూడా ఒక ధర నిర్ణయించి.. ఆ మేరకు దందాలు సాగిస్తున్నారనే ప్రచారం ఉంది. వ్యవస్థ మొత్తం గాడి తప్పిపోయింది.
ఇప్పుడు చంద్రబాబునాయుడు బెల్టుషాపుల మీద రంకెలు వేస్తున్నారు. బెల్టు షాపులు పెడితే జరిమానాలు విధించండి అని హూంకరిస్తున్నారు. దారికి రాకపోతే.. మద్యం దుకాణాల లైసెన్సులను రద్దు చేయాలని పురమాయిస్తున్నారు. బెల్టు షాపుల గురించిన ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక టోల్ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి గమనిస్తున్న వారికి మాత్రం కామెడీగా అనిపిస్తోంది.
టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయడం అనేది కేవలం మద్యం షాపులను బెదిరించి అధికారులు, లోకల్ నాయకులు దండుకోవడానికి తప్ప మరొకదానికి ఉపయోగపడేది ఉండదు. బెల్టుషాపుల్ని మేమే నిర్వహిస్తున్నాం అని ఏ లిక్కరు వ్యాపారి కూడా ఒప్పుకోడు. తనకు సంబంధం లేదనే అంటాడు. వీటన్నింటినీ మించి.. అసలు చంద్రబాబునాయుడు హూంకరింపులను ఎవరు పట్టించుకుంటున్నారు?
లిక్కర్ షాపులకు దరఖాస్తుల పర్వం నడుస్తున్నప్పుడు- వ్యాపారులు రింగ్ గా ఏర్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పట్టించుకున్న దిక్కులేదు. తెదేపా ఎమ్మెల్యేలే దగ్గరుండి రింగ్ చేయించారు. అలాట్ మెంట్ అయిన తర్వాత.. వాటాలకోసం బెదిరిస్తే ఊరుకునేది లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అధికార కూటమి ఎమ్మెల్యేలకు వాటాలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఒక్క లిక్కరు షాపు కూడా నడవడం లేదు.
అసలు చంద్రబాబు ఆగ్రహాన్ని పట్టించుకుంటున్న వారే లేరు. అందుకే ఇప్పుడు బెల్టు షాపుల విషయంలో కూడా ‘ఊరుకునేది లేదు’ అని చంద్రబాబు అంటూంటే.. జనం నవ్వుకుంటున్నారు.
vc available 9380537747
vc estanu 9380537747
Emito online payment lo entha earning ante
Asalu full money payment ante
ఇంతకీ నీ భాద ఏంటి ? రాష్ట్రం మొత్తం మీద పరిపాలన చేతనైన వాడు ఒక్క జగనే అంటావ్…అంతేగా…మరి 11 ఎందుకొచ్చాయి?
10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ,757 కోట్ల ఆస్తి జగ్గు కి, ఇలా ఎలా రా???
ఇంతకీ నీ భాద ఏంటి ? రాష్ట్రం మొత్తం మీద పరిపాలన చేతనైన వాడు ఒక్క జగనే అంటావ్…అంతేగా…మరి 11 ఎందుకొచ్చాయి?
10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ,757 కోట్ల ఆస్తి జగ్గు కి, ఇలా ఎలా రా???
ఇంతకీ నీ భాద ఏంటి ? రాష్ట్రం మొత్తం మీద పరిపాలన చేతనైన వాడు ఒక్క జగనే అంటావ్…అంతేగా…మరి 11 ఎందుకొచ్చాయి
10 లక్షల కోట్ల అప్పు రాష్ట్రానికి ,757 కోట్ల ఆస్తి జగ్గు కి, ఇలా ఎలా రా
Call boy works 9989793850
Madhya nishedham
బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ లు ఇచ్చినపుడు జనం నవ్వుకోలేదా
ఉపాధ్యాయుల్ని మందు అంగడీల ముందు నిలబెట్టడం తో పోలిస్తే ఇది అసలు 1% తప్పు కూడా కాదు మాష్టారు🥱🫣🤔