కుప్పంలో ఇల్లు.. డ్రామానే! ఎలాగంటే..?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం ఎక్కడ? ఆయన నివసించే సొంతిల్లు హైదరాబాద్ లో ఉంటుంది. అలాగే అక్కడ ఆయనకు ఒక ఫార్మ్ హౌస్ కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం ఎక్కడ? ఆయన నివసించే సొంతిల్లు హైదరాబాద్ లో ఉంటుంది. అలాగే అక్కడ ఆయనకు ఒక ఫార్మ్ హౌస్ కూడా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఆయనకు తన స్వగ్రామం నారా వారి పల్లెలో ఒక ఇల్లు ఉంది. 

కబ్జా చేశారో.. మరేదైనా ప్రత్యుపకారం చేసి ఏకంగా కాజేసారో తెలియదు గానీ.. కరకట్ట మీద అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించిన అరాచక భవనంలో ఇన్నాళ్లూ అద్దెకు నివాసం ఉంటూ వచ్చారు. సదరు అక్రమ కట్టడం యజమానిలే లింగమనేని రమేష్ మీద ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించి ఇంటిని జప్తు చేయడానికి కోర్టు అనుమతి కూడా తీసుకుంది. 

ఇప్పుడు చంద్రబాబు నాయుడు వందిమాగధులు ఆయనను రోడ్డు మీదకు లాగడానికి జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విలపిస్తున్నారు. అదే ఇంటిని జప్తు చేయడంతో పాటు, కుప్పంలో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదని ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ మాటలు విని.. అదేమిటి ఇన్నాళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా అక్కడినుంచి వరుసగా నెగ్గుతున్న వ్యక్తికి అక్కడ కనీసం ఒక ఇల్లు లేదా అనే అనుమానం మీకు కలుగుతోందా? అదే మరి చంద్రతెలివి!

ఇప్పుడు కుప్పంలో ఇంటి గోల ఏమిటో చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి 35 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇన్నాళ్లుగా అక్కడ ఎప్పుడూ కూడా ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ఆయనకు రాలేదు. తనను ఎమ్మెల్యేగా కూడా ఓడించి ఛీకొట్టిన సొంత నియోజకవర్గం చంద్రగిరి పరిధిలోని స్వగ్రామం నారావారిపల్లెలో మాత్రం ఒక సొంత భవనం కట్టుకున్నారు. అంతేకాదు ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినం నాటికి స్వగ్రామానికి చేరుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా ఆనందించడం ఆయనకు ఆనవాయితీ. 

నారావారిపల్లెలో కూడా ఇల్లు కట్టారు గాని, తనను అప్రతిహతంగా గెలిపిస్తున్న కుప్పంలో ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ఇన్నాళ్లూ ఆయనకు రాలేదు. కుప్పం ప్రజల అజ్ఞానాన్ని అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన రాజకీయ ప్రస్థానం నిరంతరాయంగా కొనసాగిస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడ ఇల్లు అవసరమేముందిలే అనుకున్నారు. 

ఏడాదికి ఒకసారి నారావారిపల్లె వెళ్ళినట్లుగా తనను గెలిపిస్తున్న ప్రజలకు కూడా ముఖం చూపిస్తే బాగుంటుందనే ఆలోచన ఆయనకు ఇన్నాళ్లూ లేదు. ఆయనకు చాలా ఆలస్యంగా కనీసం అక్కడ ఇల్లు కట్టుకోవాలని అనిపించింది. ఈ ఆలోచన రావడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కుప్పం నియోజకవర్గ పరిధిలో ప్రజలను చైతన్య పరుస్తూ ఉండడమే! 

కుప్పం ప్రజల అజ్ఞానంతో చంద్రబాబు నాయుడు ఇన్నాళ్లు ఆడుకోగా.. వారిలో చైతన్యం తీసుకువచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది! దాని ఫలితంగానే వారు కుప్పం మునిసిపాలిటీని కూడా గెలుచుకున్నారు. వైసిపి పుణ్యమా అని ప్రజల్లో మరికాస్త చైతన్యం పెరిగితే తనను ఎమ్మెల్యేగా కూడా ఛీకొడతారనే భయం చంద్రబాబుకు ఉంది. 

అందుకే తనను ప్రశ్నించే ధైర్యం ప్రజలకు రాకుండా ఉండేందుకు, తాను ఇక్కడివాడినే అని ఇంకా మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు ఈ వయసులో అక్కడ ఇల్లు కట్టించుకుంటాను అనే డ్రామా ఆడుతున్నారు! దానిని వైఎస్సార్ కాంగ్రెస్ బట్టబయలు చేస్తుండే సరికి పార్టీ మొత్తం కంగారు పడుతోంది.