ఈ రాశుల వాళ్లు మేధావులు, తెలివైన వాళ్లు!

రాశీ ఫ‌లాల‌ను న‌మ్మే వారు ఉంటారు. న‌మ్మ‌ని వారూ ఉంటారు! న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఆస్ట్రాల‌జీ ఒక శాస్త్రం. అది నిజ‌మో, కేవ‌లం విశ్లేష‌ణో కానీ.. అదో ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. దీనికి వీక్ష‌కాద‌ర‌ణ‌, పాఠ‌కాద‌ర‌ణ కూడా…

రాశీ ఫ‌లాల‌ను న‌మ్మే వారు ఉంటారు. న‌మ్మ‌ని వారూ ఉంటారు! న‌మ్మినా న‌మ్మ‌క‌పోయినా ఆస్ట్రాల‌జీ ఒక శాస్త్రం. అది నిజ‌మో, కేవ‌లం విశ్లేష‌ణో కానీ.. అదో ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. దీనికి వీక్ష‌కాద‌ర‌ణ‌, పాఠ‌కాద‌ర‌ణ కూడా చాలా చాలా ఎక్కువ‌! ఇంట‌ర్నెట్ యుగంలో కూడా ఆన్ లైన్లో రాశీ ఫ‌లాల‌ను చూసే వాళ్ల సంఖ్య ఎక్కువే! చాలా వెబ్ సైట్ల మోస్ట్ వ్యూడ్ ఆర్టికల్స్ లో కూడా రాశీ ఫ‌లాలు ఉంటాయంటే ఈ త‌రం జ‌నాల‌కు కూడా ఇవెంత ఆస‌క్తిదాయ‌క‌మైన‌వో చెప్ప‌వ‌చ్చు!

మ‌రి రాశుల ఆధారంగా మ‌నుషుల మ‌న‌స్త‌త్వాలు, వారికి ఎదుర‌య్యే ప‌రిణామాల గురించి ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉంటాయి, మ‌రి రాశీ ఫ‌లాల ప్ర‌కారం పెళ్లి సంబంధాల‌ను కూడా పరిశీలించే దేశం మ‌న‌ది. అలాగే ముహూర్తాలు వ‌గైరాలు కూడా రాశుల ఆధారంగా పెట్టుకోవ‌డం జ‌రుగుతూ ఉంటుంది. అలాగే రాశుల ఆధారంగా మ‌నుషుల మేధ‌స్సు గురించి కూడా ఈ శాస్త్రం అంచ‌నాల‌ను వేస్తూ ఉంటుంది. 

మ‌రి ఈ అంశం గురించి రాశీఫ‌లం చెప్పేదేమిటంటే ఏడు రాశుల వాళ్లు మేధ‌స్సుతో ఉంటార‌ట‌. ఇంత‌కీ ఆ రాశులేవంటే!

కుంభ‌రాశి

ఈ రాశి వాళ్లు ఇన్నొవేటివ్ థింక‌ర్స్. అలాగే వీరికి మేధో ప‌ర‌మైన ఆస‌క్తి ఎల్ల‌వేళ‌లా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌ను చేయ‌డంలోనూ, కొత్తదారుల ప‌య‌నంలోనూ వీరు చాలా ముందుంటారు! న‌వ్య‌పూర్వ‌క‌మైన ధోర‌ణిలో సాగ‌డానికి వీరు ఇష్ట‌ప‌డ‌తారు!

మిథునం

ఈ రాశివాళ్లు చాలా బ్రిలియంట్. ఎలాంటి ప‌రిస్థితుల‌కు అయినా తొంద‌ర‌గా అల‌వాటు ప‌డ‌గ‌ల ధోర‌ణి వీరిది. వీరిది క్విక్ మైండ్, అలాగే మంచి క‌మ్యూనికేష‌న్ స్కిల్స్ వీరి సొంతం. జ్ఞానం ప‌ట్ల వీరికి తృష్ట ఉంటుంది. తొంద‌ర‌గా ప‌రిస్థితుల‌కు అల‌వాటు ప‌డే త‌త్వం, కొత్త స్కిల్స్ ను వేగంగా నేర్చుకోవ‌డం ద్వారా వీరు త‌మ మేధ‌స్సును చాటుకుంటూ ఉంటారు.

క‌న్య రాశి

వీరి డీలెయిల్డ్ ఓరియెంటెడ్. విశ్లేష‌ణాత్మ‌కంగా స్ట‌డీ చేసే త‌త్వం వీరిది. షార్ట్ అండ్ ఇంటెలెక్ట్. వీరికి ఉన్న విశ్లేష‌ణాత్మ‌క శ‌క్తి ద్వారా ప్రాబ్ల‌మ్ సాల్వింగ్ అప్రోజ్, ఎబిలిటీతో వారు స‌త్తా చూపిస్తూ ఉంటారు. క్రిటిక‌ల్ థింకింగ్ ను క‌లిగి ఉండ‌టం ద్వారా ప్ర‌త్యేకంగా నిలుస్తూ ఉంటారు.

వృశ్చిక రాశి

వీరు క‌ష్ట‌ప‌డే త‌త్వాన్ని క‌లిగి ఉన్న వారు. అంకిత‌భావంతో ప‌ని చేస్తారు. లోతుగా అధ్య‌య‌నం చేస్తారు. క‌ష్ట‌సాధ్య‌మైన వాటిని కూడా అర్థం చేసుకోగ‌ల మేధ‌స్సు వీరికి ఉంటుంది. అలాగే వీరికి వ్యూహాత్మ‌క ఆలోచ‌న కూడా ఉంటుంది. ఇలా వీరు త‌మ మేధ‌స్సును చాటుతూ ఉంటారు.

మేష రాశి

ఈ రాశి వారు బాగా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటారు. వ్య‌క్తిగ‌తంగా చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తారు. వీరు చాలా సెన్సిబుల్. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో వీరిది ప్రాక్టిక‌ల్ అప్రోచ్. వీరి అంకిత‌భావం వ‌ల్ల నాయ‌కత్వ స్థాయికి ఎదుగుతూ ఉంటారు.

ధ‌నుస్సు

ఈ రాశి వారు చాలా జ్ఞాన తృష్ణ‌తో ఉంటారు. దీని ద్వారా వీరు కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు వ‌స్తూ ఉంటారు. తెలివైన వారిగా వీరు గుర్తింపును పొందుతారు. వీరికి ఉన్న ఇంటెలిక్చువ‌ల్ క్యూరియాసిటీతో ఎప్పుడూ కొత్త కొత్త వాటిని నేర్చుకుంటూ ఉంటారు.

మీన రాశి

వీరిది ఎమోష‌న‌ల్ ఇంటెలిజెన్స్. దీని ద్వారా వీరు ప్రత్యేకంగా నిలుస్తారు. క్రియేటివ్ గా ఉంటారు. త‌మ ఊహాత్మ‌క శ‌క్తితో వీరు గొప్ప వాటి సాధ‌న‌లో త‌మ‌దైన పాత్ర‌ను పోషిస్తూ ఉంటారు.