గత కొన్ని రోజులుగా మెగా హీరో నాగబాబు కూమారై నిహారిక విడాకులపై జరుగుతున్న వార్తలు నిజమైనట్లు కనపపడుతున్నాయి. ఇవాళ నిహారిక కూటట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో విడాకులు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కాగా గత కొన్ని రోజులుగా నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా ఆమె దూరంగా ఉంటోంది.
గత కొంత కొన్ని రోజుల క్రితం తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిహారిక-చైతన్య తొలగించింది. దీంతో అప్పటి నుండి విడాకులపై వార్తలు వస్తునే ఉన్నాయి. ప్రస్తుతం ఆ వార్తలు నిజం చేకురుస్తూ నిహారిక తన విడాకులపై కోర్టుకు వెళ్ళింది. కాగా నిహారిక 2020 డిసెంబర్‌లో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నారు. చైతన్య గుంటూరు మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కుమారుడు అనే విషయం తెలిసిందే.
గత నెలలో కూడా నిహారిక అన్న వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్‌లో కూడా చైతన్య ఎక్కడ కనపడలేదు. దీంతో వార్తలు మరింత వైరల్ అయ్యాయి. మరోవైపు నిహారిక బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా తన మూడో భార్యతో దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే వచ్చే ఎన్నికల వరకు పవన్ విడాకులపై గురించి క్లారిటి రాకపోవచ్చు.