జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తన ముద్ర గల దార్శనికతతో తీసుకువచ్చిన అనేక వ్యవస్థల్లో వాలటీరు వ్యవస్థ కూడా ఒకటి. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఎలాంటి కొరతగానీ, దళారీ పాత్రగానీ లేకుండా నేరుగా ప్రజలకు చేరుస్తున్న వ్యవస్థ అది. జగన్ సర్కారు ప్రతిష్ఠను పేదల దృష్టిలో అమాంతం పెంచిన ఏర్పాటు అది. అందుకే ఆ వాలంటీరు వ్యవస్థ మీద తెలుగుదేశం పార్టీకి ద్వేషం.
పైకి నయవంచనపూర్వకమైన మాటలు చెబుతూనే ఉన్నప్పటికీ.. ఆ వ్యవస్థను నిర్మూలించేందుకే చంద్రబాబు కంకణం కట్టుకున్నారని పలువురు అంచనా వేస్తున్నారు. ఆయన వారిపై విషపూరితమైన కక్ష పెంచుకున్నారని అంటున్నారు.
చంద్రబాబు రాసి పంపిన స్క్రిప్టులను చదవడం అలవాటుగా ఉండే పవన్ కల్యాణ్ అసలు వాలంటీర్లపై ఎంత అభ్యంతరకరమైన భాషలో విమర్శలు చేశారో కూడా అందరికీ తెలుసు. అయితే.. వాలంటీరు వ్యవస్థ తలచుకుంటే తమకు పుట్టగతులు ఉండవని తెలుసుకున్న చంద్రబాబునాయుడు మాత్రం.. వారితో అనునయంగానే మాట్లాడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ వ్యవస్థ యథాతథంగా కొనసాగుతుందని, ఆ వ్యవస్థను తొలగిస్తాం అనేది అబద్ధపు ప్రచారం అని ఆయన అంటున్నారు. అదే సమయంలో.. వాలంటీర్లకు శిక్షణ ఇప్పించి.. వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం అని చంద్రబాబు అంటున్నారు. శిక్షణలు ఇప్పించడం అంటేనే.. అక్కడితో వారి వాలంటీరు ఉద్యోగానికి భరతవాక్యం పలకడమే ఆయన ఉద్దేశం అనే ప్రచారం జరుగుతోంది. వాలంటీర్లలో భయం పుడుతోంది.
ఇలాంటి మాయమాటలు చెప్పడం ద్వారా చంద్రబాబునాయుడు.. మీరెవ్వరూ వైసీపీ కోసం పనిచేయవద్దు.. మీరంతా మంచి వాళ్లు.. చదువుకున్న వాల్లు.. జగన్ ను ఓడించడానికి నాకు సహకరించండి.. అని మభ్య పెడుతున్నారు.
ఇక్కడ వాలంటీర్లకు కలుగుతున్న సందేహం ఒక్కటే! వాలంటీరు వ్యవస్థ గురించి మహిళా వాలంటీర్ల గురించి అంత నీచంగా పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు.. వాలంటీర్ల గౌరవం కాపాడడానికి తగినట్టుగా చంద్రబాబు నోరు మెదపలేదు. పవన్ వ్యాఖ్యలను ఖండించలేదు. ఆయనను దిద్దే ప్రయత్నం చేయలేదు.
అలాంటి అవకాశవాది చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో.. తమ చేతిలో ఓటర్లను ప్రభావితం చేయగల శక్తి ఉందనే నమ్మకంతో ఇలా మోసపూరింగా అంటున్నారని వాలంటీర్లు భావిస్తున్నారు. ఆయన మాయోపాయాలు వాలంటీర్లపై పనిచేయవని కూడా అనుకుంటున్నారు.