జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించ‌డానికి సిగ్గులేదా?

14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబునాయుడు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా, ఇప్పుడు మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశావ‌ని సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నెల 23న కుప్పానికి జ‌గ‌న్ వెళుతుంటే చంద్ర‌బాబు…

14 ఏళ్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబునాయుడు త‌న నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీస సౌక‌ర్యాలు క‌ల్పించ‌కుండా, ఇప్పుడు మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశావ‌ని సీఎం జ‌గ‌న్‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఈ నెల 23న కుప్పానికి జ‌గ‌న్ వెళుతుంటే చంద్ర‌బాబు ఓర్వ‌లేకున్నారు. జ‌గ‌న్ వెళితే త‌న పునాదులు క‌దిలిపోతాయేమో అని ఆందోళ‌న చెందుతున్న‌ట్టు… చంద్ర‌బాబు మాట‌లు ప్ర‌తిబింబిస్తున్నాయి.

జైల్లో వున్న త‌న వాళ్ల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి చంద్ర‌బాబు చిత్తూరు వెళ్లారు. జైల్లో ప‌రామ‌ర్శ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… “మ‌రో రెండు రోజుల్లో జ‌గ‌న్‌రెడ్డి కుప్పం వ‌స్తారంట‌. మూడున్న‌రేళ్ల‌లో ఏం చేశావ‌ని కుప్పంలో ప‌ర్య‌టిస్తావ్ జ‌గ‌న్‌రెడ్డి? నీ పులివెందుల నియోజ‌క‌వ‌ర్గానికి నేనే నీళ్లిచ్చా. కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి హంద్రీ-నీవా నీళ్లెందుకు తీసుకురాలేదో చెప్పే ధైర్యం నీకుందా?” అని నిల‌దీశారు.

రాయ‌ల‌సీమ‌కు నీళ్లిచ్చేందుకు వైఎస్సార్ హ‌యాంలో ప్రాజెక్టులు క‌ట్టారు. కాలువ‌లు త‌వ్వించారు. చంద్ర‌బాబు సీఎం అయిన త‌ర్వాత గేట్లు ఎత్తి నీళ్ల‌ను వ‌ద‌ల‌డం కూడా త‌న క్రెడిట్‌గా చెప్పుకుంటున్న ప‌రిస్థితి. పులివెందుల‌కే నీళ్లిచ్చిన చంద్ర‌బాబు, త‌న నియోజ‌క‌వ‌ర్గానికి ఎందుకు ఇవ్వ‌లేదో స‌మాధానం చెప్పాల్సి వుంది. ఏకంగా 14 ఏళ్ల పాటు సీఎంగా ప‌ని చేసి, చివ‌రికి సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా గుక్కెడు నీళ్లు ఇవ్వ‌కుండా, మూడున్న‌రేళ్ల‌లో ఎందుకు ఇవ్వ‌లేద‌ని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించ‌డానికి సిగ్గులేదా? అని పౌర స‌మాజం ప్ర‌శ్నిస్తోంది.

కుప్పం నియోజ‌క‌వ‌ర్గానికి హంద్రీ-నీవా నీళ్లెందుకు తీసుకురాలేదో చెప్పే ధైర్యం జ‌గ‌న్‌కా, చంద్ర‌బాబుకా ఉండాల్సిందని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. కుప్పాన్ని రెవెన్యూ డివిజ‌న్‌గా చేయాల‌ని జ‌గ‌న్‌కు లేఖ రాయ‌డాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ప్రాధాన్య అంశాలు వేర‌ని, మ‌రొక‌రు అధికారంలో వుంటే మాత్రం అది చేశావా? ఇది చేశావా? అని ప్ర‌శ్నించ‌డం ఆయ‌న నైజ‌మ‌ని విమ‌ర్శిస్తున్నారు.