Advertisement

Advertisement


Home > Movies - Movie News

కృష్ణ..వృిందా..ఫంక్షన్ ఇలాగా చేసేది..?

కృష్ణ..వృిందా..ఫంక్షన్ ఇలాగా చేసేది..?

దాదాపు అరడజను మంది నిర్మాతలు. ఇద్దరు ముగ్గురు దర్శకులు. ఓ సీనియర్ పొలిటీషన్. ఇక జనరల్ క్రౌడ్. సుమ యాంకర్. ఇదీ నిన్నటికి నిన్న జరిగిన కృష్ణ వ్రింద విహారి ప్రీ రీలీజ్ ఫంక్షన్ సెటప్. కానీ ఫంక్షన్ మాత్రం చుట్టేసినట్లు జరిగిపోయింది. జస్ట్ అనార్గనైజ్డ్ ఫంక్షన్ లా జరిగింది. ఇటీవల కాలంలో ఇంత అనార్గనైజ్డ్ గా జరిగిన మూవీ ఫంక్షన్ ఇదే నేమో? ఒక గెస్ట్ వస్తుంటే సీట్లోంచి మరో గెస్ట్ ను లేపి కూర్చో పెట్టిన వైనం ఇక్కడే చూసాం.

ప్రీ రీలీజ్ సెట్ సింపుల్ గా కానిచ్చేసారు. ఓ కెమేరా పెట్టి అయిందనిపించేసారు. సరే అదంతా ఓకె అనుకుంటే, సరైన ఏవీ ప్రెజెంటేషన్లు లేవు. పైగా వేసిన విడియోలే మళ్లీ మళ్లీ అన్నట్లు కంటెంట్ ..వాటిలో అడియోలు లేనివి కొన్ని. అసలు ఎందుకు వేస్తున్నారో తెలియదన్నట్లు కొన్ని.

మిగిలిన సినిమా ఫంక్షన్స్ లో కీలక గెస్ట్ లు వస్తుంటే స్టేజ్ మీదకు సమాచారం ఇచ్చి వారికి ఆహ్వానం పలుకుతారు. అలాంటిది ఇంత మంది యంగ్ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్లు వచ్చినా ఓ పిలుపు లేదు. ఆహ్వానం లేదు. సరైన ఇంట్రడక్షన్ లేదు. చీఫ్ గెస్ట్ అనిల్ రావిపూడికి కూడా ఓ ఎవి లేదు.

గమ్మత్తేమిటంటే ఎవరి ఐడియానో కానీ స్టేజ్ మీదకు హీరో శౌర్య ను పిలిచి అతని సినిమాల మీదే ఓ గేమ్ ఆడించారు. అందు కోసం శౌర్య ఎప్పడో చేసిన పేరూ ఊరు తెలియనివి, ఫ్లాపువి, చిన్న సినిమాలు అన్నీ ఏరి కోరి ఎంచుకున్నారు. దాంతో శౌర్య చాలా ఎంబ్రాసింగ్ గా ఫీలయినట్లు కనిపించింది.

మొత్తం మీద ఇటీవల జరిగిన సినిమా ఫంక్షన్ ల్లో, ఇంత బాగా గెస్ట్ లు వచ్చినా, ఇంత బాగా జనాలు వచ్చినా, ఇంత తక్కువగా, ఇంత అనార్గనైజ్డ్ గా జరిగిన ఫంక్షన్ ఇదే. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?