తిండీ, తరలింపూ సరే.. ఆ మాట చెప్పండి బాబుగారూ!

పూడికలు తీయించడం అంటే.. మళ్లీ ఆక్రమణలు కూల్చాల్సి వస్తుందని.. దానివల్ల ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆయన భయపడుతున్నారా?

విజయవాడ మొత్తం వర్షపు నీటి దిగ్గబంధనంలో అల్లకల్లోలం అయిపోతోంది. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులకు సహాయక చర్యలు అందించడం, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అనే పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.

చంద్రబాబు నాయుడు తనకు అలవాటైన రీతిలో విపత్తు రాగానే చాలా అద్భుతంగా స్పందించి పనులు నడిపిస్తున్నారు. సింగ్ నగర్ ప్రాంతానికే బోటులో ఆయన రెండుసార్లు వెళ్లారు. అర్ధరాత్రి కూడా వెళ్లి అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే సోమవారం ఉదయానికెల్లా నేవీ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. బాధితులను తరలించే ప్రయత్నాలు ప్రారంభించాయి.

విజయవాడ నగరంలోగానీ, నగరం చుట్టూతా గానీ ఉన్న పంటకాలువల్లో పూడిక తీసి ఎన్నాళ్లయింది? ఆ సంగతి చంద్రబాబు నాయుడు కు ఏమైనా గుర్తుందా? అనేది ప్రజల ప్రశ్నగా ఉంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి ముప్పయ్యేళ్లు పూర్తయ్యాయంటూ ఆయన అభిమానులు పండగలు చేసుకోవాలని తలపోసి.. భారీ వర్షాల వల్ల ప్రస్తుతానికి వాయిదా వేసుకున్నారు. మరి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడైనా కాలువల్లో పూడిక తీయించినట్టుగా చంద్రబాబునాయుడుకు గుర్తుంటే చెప్పాలి.

పూడిక తీయకపోవడం వల్లనే.. కాలువలు నెమ్మదిగా కురచనైపోవడం.. వాటిని ఆక్రమించిన తొలుత పేదలు, తర్వాత వారినుంచి కొనేసుకుని బడాబాబులు చిన్నా పెద్దా భవంతులు నిర్మించుకోవడం.. ఇదంతా కూడా చాలా అలవాటుగా మారిపోయింది.

ఇప్పుడు భారీ వర్షాలకు విజయవాడకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇంతటి ఘోరమైన పరిస్థితి వచ్చిందంటే.. అందుకు కారణం కేవలం భారీ వర్షం మాత్రమే అని చెప్పేసి తప్పించుకోవడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. గత యాభయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా 39 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అంటున్నారు. ఆ సాకులు బాగానే ఉంటాయి. కానీ.. కాలువల వ్యవస్థ సక్రమంగా ఉంటే.. ప్రజలు పడుతున్న ఇబ్బందుల తీవ్రత ఇప్పుడున్నంత స్థాయిలో ఉండేది కాదు కదా.. అనేది ఆయన ఒప్పుకోవాలి.

బాధలు పడుతున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడం, అవసరమైన దినుసులు పంచడం, వారిని తరలించడం వంటి మంచి పనులు ఎన్నో చంద్రబాబు చేస్తున్నారు. అదే సమయంలో.. కనీసం ఒక్కసారైనా సరే.. కాలువల్లో పూడిక తీయించడం గురించి శ్రద్ధపెడతాం.. పూడికలు తీయిస్తాం అనే మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు? పూడికలు తీయించడం అంటే.. మళ్లీ ఆక్రమణలు కూల్చాల్సి వస్తుందని.. దానివల్ల ప్రజా వ్యతిరేకత వస్తుందని ఆయన భయపడుతున్నారా? పూడికలు తీసే పనిచేయకుండా.. మిగిలిన సహాయక చర్యలన్నీ ఇలాంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారాలు కాగలవా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

24 Replies to “తిండీ, తరలింపూ సరే.. ఆ మాట చెప్పండి బాబుగారూ!”

    1. అలవాటైన పనిని ga కంటే బాగా ఎవడూ చేయలేడు. వీడు గాడిదచేత గుడ్డు కూడా పెట్టించగలడు!

  1. ముందు ఈ విపత్తు దాటనీ రాజా! ఆ తరువాత బాబు గారు తప్పకుండా పూడికలు తీయిస్తారు. అసలే ఈ మధ్య నీ ఆర్టికల్స్ చూసి ఎలా పరిపాలించాలో నేర్చుకుంటున్నారు కూడా.

  2. Sahayama???oka glass water echey vaadu ledu… second ABN channel la tayyarayyvu nuvvu GA.okka Nakoduku raalesu.veedu singnagar lo hati ga shikar ki vachinattu vachadu boat lo ..yenni dead bodies dorikayo telusa.yelago yellow media chupinchadu.Maa mla vedhava Munda koduku yekkadunnado teliyadu.sujana Chowdhury.

  3. చంద్రబాబు గారు ఉమ్మడి ఆంధ్రపదేశ్ సీఎం గా ఉన్నప్పుడే నీతి పరుడల గురించి ఏర్పాటు చేసి ప్రతి ఏట వేశవిలో కాలువల్లో పొడిక తీయించేవారు. బహుశ ఆ విషయం ఇప్పుడున్న తరానికి తెలియకపోవచ్చు

  4. Jagan bayatike raledu kada Ela eppudu. Paradala cm ni emanakunda cbn ni enduku question chestunnaru. 60 years cross ayina prajalaku ela seva chese vallani ante puttagathulundavu papishti janmalu

  5. వీడు నిజంగా యదవ నా……. కాలువల పూడిక గురించి మాట్లాడటం మళ్ళీ. ఐదేళ్లు మన యువరాజుగారు ఎవడి……. కు… శాడో నీకు తెలియదా? నిండా మూడు నెలలు గడవని బాబుగార్ని ప్రశ్నిస్తున్నావ్?

  6. కాలువ పూడిక గురించి గత ప్రభుత్వాల తప్పిదాలు కూడా లెక్క లోకి తీసుకోవాలి.. writer/author గారు ఇది సమిష్టిగా విఫలమయ్యారు.. 2014 తో 2019 మరియు 2019 నుండి 2024 .. 2024 నుండి ప్రస్తుత ప్రభుత్వం.. ఇప్పుడున్న project/barrage/ Dam maintenance కోసం ఎంత ఖర్చు చేశారు, లెక్కపత్రం ఉండాలి కదా.. ప్రతి సంవత్సరం నీటి పారుదల బడ్జెట్ పెడుతున్నారు, మరి వాటి ఖర్చు వివరాలు ఏమవుతున్నాయి ..

  7. అది సరేకాని 5 ఏళ్ళు సీఎం గా చేసిన జగన్ రెడ్డి ఎం పీకాడు మరి పూడికలు తీయించకుండా ..??

  8. నువ్వు అన్నం tintunnava?? లేక……. tintunnava????

    నీకు మతి భ్రమించే పిచ్చి వ్రాతలు rastunnavau. ముందు నువ్వు పిచ్చి ఆసుపత్రి లే చేరు

  9. What your Jaggadu did in five years except adopting policy of Dochuko and Dachuko. Whenever a calamity happened during his tenure he used to have an aerial survey and washed his hands. See a 70 plus working day and night. Shame less Great Andhra you are criticising him. You and 420 go to Narak directly.

Comments are closed.