నిత్యం వివాదాల చుట్టూ తిరిగే బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చుట్టూ ఉండే వివాదాల వల్లే పెళ్లిపై ఇంకా డిసైడ్ కాలేదని చెప్పింది. తన కాబోయే అత్తమామల ముందు తనకు పోలీసు సమన్లు ఎలా వచ్చాయనే దానిపై కూడా సరదాగా చెప్పుకొచ్చింది.
తన సినిమా ప్రమెషన్ నేపధ్యంలో ఓ మీడియాలో ఆమె మాట్లాడుతూ.. తన చుట్టూ ఉన్న ప్రతికూల ప్రచారం వల్ల పెళ్లి చేసుకోలేదని, తనపై ఉన్న కేసులు కూడా ఒక కారణంగా చెప్పింది. అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే రాజకీయవేత్తను చేసుకుంటారా? లేక నటుడి చేసుకుంటారా? అని అడగగా ఇప్పుడు దీని గురించి చెప్పలేను కానీ పెళ్లిపై చాలా అభిప్రాయాలు ఉన్నాయని చెప్పింది.
కాగా కంగనా రనౌత్ తనే దర్శకత్వం వహించి.. నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. అయితే తాజాగా కొందరు సినిమా విడుదల చేయకూడదని పట్టుబడుతున్నారు. తమ మాట వినకుండా మూవీని రిలీజ్ చేస్తే చంపేస్తామని కంగనాను బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు.
ఇటీవలే రైతు ఉద్యమంపై కంగనా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. సొంత పార్టీ నేతలే దీనిపై కలగజేసుకుని కంగనాకు అక్షింతలు వేశారు. ఇలా నిత్యం అయినదానికి కానిదానికి హడావుడి చేసి విమర్శలపాలై కేసుల చూట్టు తిరిగే ఈ బీజేపీ ఎంపీకి ప్రస్తుతం పెళ్లిపై క్లారిటీ లేదని అంటోంది. ఏదో రోజు అందరి సెలబ్రిటీలు షాక్స్ ఇస్తున్నట్లే తన సోషల్ మీడియా పెళ్లి గురించి చెప్పే అవకాశం లేకపోలేదు.
PELLI AVASARAMAA DEENIKI ?
Em raa ayya entho mandhi kamma ga pelli ki munde sarasaalu aadutuntaaru. Eme enno sarlu cheppindi adigite commitment echhanu offers kosam.
Opposite party or known party she is sometimes good.
vc estanu 9380537747
Call boy jobs available 8341510897
Pelli chesukoka poina anni vuntai life lo animals laga