చిరంజీవికి ‘ఫ్యాక్షన్ యూనివర్స్’ కావాలంట

తన సినిమాల్ని ఒకదానికొకటి ముడిపెడుతూ ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించాడు లోకేష్ కనగరాజ్. యానిమల్ పార్క్ పేరిట సందీప్ రెడ్డి వంగ కూడా అదే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ కూడా తనదైన…

తన సినిమాల్ని ఒకదానికొకటి ముడిపెడుతూ ఎల్సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) సృష్టించాడు లోకేష్ కనగరాజ్. యానిమల్ పార్క్ పేరిట సందీప్ రెడ్డి వంగ కూడా అదే పనిలో ఉన్నాడు. ప్రశాంత్ వర్మ కూడా తనదైన యూనివర్స్ క్రియేట్ చేసి, సొంత పేరు పెట్టుకున్నాడు.

ఇలాంటి ఓ యూనివర్స్ తనకు కూడా కావాలంటున్నారు చిరంజీవి. అది కూడా అలాంటిలాంటి యూనివర్స్ కాదు. ఆయనకు కావాల్సింది ‘ఫ్యాక్షన్ యూనివర్స్’. అవును.. ఇంద్ర, సమరసింహారెడ్డి పాత్రలతో ఓ కథ ఆశిస్తున్నారు చిరు.

“ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, పార్ట్-1, పార్ట్-2 అంటున్నారు. ఇలాంటి టైమ్ లో ఎవరైనా ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఒక సినిమా కథ రాసుకొస్తే అందులో నటించడానికి నేను రెడీ. బాలయ్య మీరు రెడీనా?”

ఇలా 2 రెడ్ల పాత్రలతో ఓ కామన్ సినిమా అడుగుతున్నారు చిరంజీవి. పక్కనే ఉన్న బాలయ్య కూడా సై అంటే సై అన్నారు. ఆ వెంటనే బోయపాటి వైపు తిరిగి దీన్నొక ఛాలెంజ్ గా తీసుకోమన్నారు చిరంజీవి.

బాలకృష్ణ 50 వసంతాల సినీకెరీర్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు. వరుస ఫ్యాక్షన్ కథలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో, తన దగ్గరకు ఇంద్ర సినిమా కథ వచ్చినప్పుడు, మెప్పించగలనా లేదా అని తర్జనభర్జన పడ్డారట చిరంజీవి. చివరకి కథలో బలం ఉండడంతో చేశారట.

7 Replies to “చిరంజీవికి ‘ఫ్యాక్షన్ యూనివర్స్’ కావాలంట”

  1. Appudu chiru ki 2 balayya ki 3 total 5 heroines kavali. Vallu Mee venta padutunte choodaleka mem chavali. Small request. Mee iddariki money, identity rendu unnay. Mee meeda respect perigela mammutti mohanlal, Kamal sir chestunnattu manchi roles cheyyandi. Mee meeda respect untundi.

    1. Aa respect tho vaalla allullaki em konivvagalaru. Respect Kamal moota kattukunnaadu kanake Vikram cinema ki mundhu appullo unnaadu. Ekkado r narayanmurthy lanti vallu kaakunda andaru money kosame egabadathaaru

Comments are closed.