ప‌వ‌న్‌కు బ‌న్నీ బ‌ర్త్ డే విషెస్‌… ఏదో తేడా!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది ఇవాళ పుట్టిన రోజు. టాలీవుడ్ అగ్ర‌హీరోతో పాటు రాజ‌కీయాల్లోనూ ఆయ‌న ప్ర‌ముఖుడు కావ‌డంతో పాటు అధికారంలో కొన‌సాగుతుండ‌డంతో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ రంగాల‌కు…

జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ది ఇవాళ పుట్టిన రోజు. టాలీవుడ్ అగ్ర‌హీరోతో పాటు రాజ‌కీయాల్లోనూ ఆయ‌న ప్ర‌ముఖుడు కావ‌డంతో పాటు అధికారంలో కొన‌సాగుతుండ‌డంతో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ప‌వ‌న్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు చెబుతూ త‌మ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇందులో భాగంగా టాలీవుడ్ యువ అగ్ర‌హీరో అల్లు అర్జున్ శుభాకాంక్ష‌లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఏక‌వాక్యంలో ప‌వ‌న్‌కు ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం, అది కూడా మొక్కుబ‌డిగా వుండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

‘పవర్‌స్టార్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని బ‌న్నీ త‌న స్టైల్‌లో విషెస్ చెప్పారు. ఇటీవ‌ల అల్లు అర్జున్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ధ్య విభేదాలు బ‌హిరంగ‌మైన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ఇష్ట‌మైన చోటికి వెళ్తాన‌ని అల్లు అర్జున్ కామెంట్ చేసి, ప‌రోక్షంగా ప‌వ‌న్‌కు త‌న ఉద్దేశాన్ని వెల్ల‌డించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అలాగే బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ పరోక్షంగా అల్లు అర్జున్ గురించి ఘాటు కామెంట్స్ చేశారు. ఇప్పుడు సినిమాల్లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్లు హీరోలు అవుతున్నార‌ని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌, అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య సోష‌ల్ మీడియాలో ఒక ర‌క‌మైన వార్ జ‌రుగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌కు మ‌ర్యాద కోసం బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు చెప్ప‌డం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

10 Replies to “ప‌వ‌న్‌కు బ‌న్నీ బ‌ర్త్ డే విషెస్‌… ఏదో తేడా!”

  1. 😂😂😂….. బాబాయ్ కి వచ్చిన అతి కిరాతక గుండెపోటు చూసాక నీకు అన్నీ అలా అనిపిస్తున్నాయ్ ఏమో GA…..

    1. AA paid his money to some YouTubers like army to maintain his stardum,,,,😂😂😂😂😂. without mega fans support he doesn’t survive. So change attitude otherwise your are the next vijayadevara konda.😂😂😂😂

Comments are closed.