టీడీపీ అధినేత చంద్రబాబు బొబ్బిలి సభలో మాట్లాడుతూ తాను 2019లో అధికారంలోకి వచ్చి ఉంటే సామాజిక పెన్షన్ మూడు వేల రూపాయలు ఇచ్చేవాడిని అని చెప్పారు. జగన్ అలా కాకుండా చివరి ఏడాదిలో మూడు వేల రూపాయలు పెన్షన్ గా ఇస్తున్నారు అని విమర్శించారు.
అసలు సామాజిక పెన్షన్ హామీల గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు 2014లో అధికారంలో ఉన్నపుడు పెన్షన్ ని కేవలం వేయి రూపాయలు మాత్రమే ఇచ్చారు. జగన్ పాదయాత్ర సందర్భంగా తాను అధికారంలోకి వస్తే రెట్టింపు చేస్తూ రెండు వేల రూపాయలు పెన్షన్ గా ఇస్తాను అని హామీ ఇచ్చారు. దాంతో ఎన్నికల వేళ చంద్రబాబు హడావుడిగా ఒకటి రెండు నెలలు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది.
దాని మీద జగన్ పాదయాత్రలో మరో హామీ ఇచ్చారు. టీడీపీ తన హామీని పట్టుకుని సామాజిక పెన్షన్ రెండు వేల రూపాయలు చేసింది. తాను అధికారంలోకి వస్తే దశల వారీగా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని మరో హామీ ఇచ్చారు. ఆ మేరకు 2024 నాటికి వైసీపీ మూడు వేల రూపాయలు సామాజిక పెన్షన్ ఇస్తూ తన హామీని నిలబెట్టుకుంది.
విషయం ఇలా ఉంటే చంద్రబాబు ఎపుడు మూడు వేల రూపాయలు ఇచ్చేది అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రెండు వేల పెన్షన్ ఇచ్చింది కూడా తన అధికారం చివరాఖరులో అని గుర్తు చేస్తున్నారు మూడు వేల పెన్షన్ అన్నది జగన్ సొంత హామీ అని, ఆయన ఎక్కడా జనాలను మభ్యపెట్టకుడా దశలవారీగా పెన్షన్ పెంచుకుంటూ పోతామని పాదయాత్రలో చెప్పుకొచ్చారని అంటున్నారు.
చంద్రబాబు మాత్రం తాను అపుడే గెలిచి ఉంటే మూడు వేల పెన్షన్ అని ఎలా చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పెన్షన్ పెంచాలని ఆలోచన రాని టైం లోనే జగన్ ఈ హామీ ఇచ్చారని అలా రెండువేల పెన్షన్ బాబు చేత పెంచడానికి జగన్ కారణం అని కూడా అంటున్నారు. చంద్రబాబు తన ప్రసంగాలలో అవాస్తవాలను జనాలకు చెబుతూ లబ్ది పొందడానికి చూస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.