పవన్ ని తిడతారా.. చంద్రబాబు సీరియస్!

ఇంకా పొత్తుల‌పై క్లారిటీ రాకుండానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప్రేమను కురిపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇటీవ‌ల ముచ్చ‌ట‌గా మూడో సారి ఇరువురు క‌లిసి పొత్తుల‌పై చ‌ర్చించుకోవ‌డంపై సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై…

ఇంకా పొత్తుల‌పై క్లారిటీ రాకుండానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప్రేమను కురిపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఇటీవ‌ల ముచ్చ‌ట‌గా మూడో సారి ఇరువురు క‌లిసి పొత్తుల‌పై చ‌ర్చించుకోవ‌డంపై సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై వస్తున్నా ట్రోలింగ్ పై చంద్ర‌బాబు ట్వీట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా రైతాంగం నష్టపోతుంటే ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేద‌ని.. మంత్రులు కనీసం ఒక్క చోట కూడా రైతుల దగ్గరకు, పొలాల్లోకి వెళ్లడం లేదని.. అన్నదాత కష్టం పై కనీసం ఆరా తీయడం లేదని.. ఇక సీఎం సంగతి సరేసరి అంటూ రజనీకాంత్ ను తిట్టే పని కాదు.. ధాన్యం రైతుల కష్టాలు చూడండి…. పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం కాదు…మిర్చి రైతుల బాధలు వినండి… ప్రతిపక్ష నేతల అరెస్టులు, దాడులు కాదు…పొలంలో అన్నదాతల దుస్థితిపై దృష్టి పెట్టండి. కర్షకులకు భరోసా ఇవ్వండి…ప్రభుత్వం నుంచి తగిన సాయం చేయండి.. అంటూ ట్వీట్ చేశారు.

అకాల వ‌ర్ష‌ల వ‌ల్ల రైతులు న‌ష్ట‌పోవ‌డం గురించి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పు లేదు.. కానీ అన‌వ‌స‌రంగా ప‌వ‌న్ పేరు ఎత్త‌డంతో రైతుల స‌మ‌స్య‌లు ప‌క్క‌దారి ప‌ట్టి ప‌వ‌న్ పై ఇంత ప్రేమ ఎందుకు బాబు అంటూ చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్నారు. కాగా అకాల వ‌ర్ష‌ల వ‌ల్ల రైతాంగం న‌ష్ట‌పోయిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు చెప్పినట్లు రైతుల గురించి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోని న‌ష్ట‌పోయిన రైతుల‌ను అదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

కాగా ఇంకా పొత్తుల‌పై క్లారిటీ రాకుండానే ఎమ్మిగ‌నూరులో లోకేశ్ స‌భ‌కు జ‌న‌సేన శ్రేణులు వెళ్లి.. స‌భ‌లో జ‌న‌సైనికులు జెండాలు ప‌ట్టుకుని ఉత్సాహం ప్ర‌ద‌ర్శించారు. అలాగే తెలుగు త‌మ్ముళ్ల‌తో పాటు ప‌వ‌న్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు కూడా లోకేశ్ స్వాగ‌తం ప‌ల‌క‌డం విశేషం.