పారితోషికం సంగతి సరే.. ముందు ఒప్పుకోవాలి కదా

“రూ.150 కోట్ల సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఒప్పుకోవాలి కదా!” ప్రాజెక్ట్-K యూనిట్ సభ్యుల నుంచి వచ్చిన తాజా స్పందన ఇది. కమల్ హాసన్ కు చెందిన మేటర్ ఇది. Advertisement ప్రభాస్ హీరోగా…

“రూ.150 కోట్ల సంగతి తర్వాత చూద్దాం.. ముందు ఒప్పుకోవాలి కదా!” ప్రాజెక్ట్-K యూనిట్ సభ్యుల నుంచి వచ్చిన తాజా స్పందన ఇది. కమల్ హాసన్ కు చెందిన మేటర్ ఇది.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్-కె సినిమాలో విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ను సంప్రదించారట. అతడు ఏకంగా 150 కోట్లు డిమాండ్ చేశాడంట. వీళ్లు ఒప్పుకున్నారట. దీంతో ప్రభాస్ సినిమాలో విలన్ గా నటించడానికి కమల్ అంగీకరించాడట. ఇదీ నిన్నట్నుంచి నడుస్తున్న ఊహాగానం.

ఇందులో ఒక్క పాయింట్ మాత్రం నిజం అంటున్నారు యూనిట్ జనం. ప్రాజెక్ట్-కెలో విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ను అప్రోచ్ అయిన మాట వాస్తవమని అంగీకరించారు. అంతకుమించి ఒక్క అడుగు కూడా మేటర్ ముందుకు కదల్లేదనేది వాళ్ల మాట.

సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది ప్రాజెక్ట్-కె సినిమా. కథకు తగ్గట్టు ఈ మూవీలో విలన్ పాత్రకు కూడా ఓ స్టార్ కావాలి. పైగా ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను తొందరగా అర్థం చేసుకొని నటించే కమల్ హాసన్ లాంటి నటుడు అయితే మరీ మంచిదనే ఉద్దేశంతో అతడ్ని సంప్రదించారు. అది కూడా చాన్నాళ్ల కిందట.

అయితే కమల్ నుంచి మాత్రం ఇప్పటివరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. అంతలోనే ఈ మేటర్ బయటకురావడం, కథనాలు వచ్చేయడం చకచకా జరిగిపోయాయి. అతడికి ఏకంగా 150 కోట్ల పారితోషికం ఇచ్చారనేది కూడా అవాస్తవమే.