సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఉత్తరాంధ్ర టూరు చేస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఒకే రోజు మూడు జిల్లాల్లో పలు అభివృద్ధి పనుల పర్యవేక్షణ, అధికారులతో సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకవైపు విశాఖ ఆర్థిక రాజధాని చేయాలనుకుంటున్నాయన విశాఖ అభివృద్ధిపై ఎటువంటి సూచనలు చేస్తారు అనేది అందరికీ ఆసక్తి నెలకొంది.
నేడు అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నా సీఎం చంద్రబాబు ఉదయం పదింటికి వైజాగ్ చేరుకుని అనకాపల్లి జిల్లాలోని పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోగాపురం ఎయిర్పోర్టును సందర్శిస్తారు. మధ్యాహ్నం సీఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు. వైజాగ్లో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులపై సాయంత్రం సమీక్ష నిర్వహించి తిరిగి రాత్రికి ఉండవల్లికి చేరుకోనున్నారు.
కాగా వైయస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖ కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వాటిని కొనసాగిస్తారా లేదా?… అలాగే విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని ఇప్పటికే చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో అధికారులకు సూచనలతో పాటు.. నిన్న విశాఖ కేంద్రంగా ఓ జాతీయ పత్రిక కార్యాలయంపై టీడీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో దాడులపై నాయకులకు ఎటువంటి సూచనలు ఇస్తారో అనేది అందరూ చూస్తున్నారు.