ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు తాడేపల్లి నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఇవాళ రాత్రికే ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నారు అయితే సీఎం టూర్ పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.
రెండు వారాల్లో రెండోసారి సీఎం ఢిల్లీ టూర్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో.. ఏపీకి సంబంధించి రెండు కీలక అంశాలపై కేంద్రం ప్రకటనలు చేసింది. ప్రత్యేక హోదా, పోలవరం గురించి పార్లమెంట్ సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ ప్రకటనల నేపథ్యంలో.. జగన్ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇటు.. సోమవారం సాయంత్రం జగన్.. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. బడ్జెట్, జీ-20 సదస్సు, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. గవర్నర్‌తో భేటీ అయిన రెండు రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.