కాంగ్రెస్ కుట్ర ఎజెండా వెరీ క్లియర్!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిన అపకీర్తి పాల్జేయడానికి తద్వారా చంద్రబాబునాయుడుకు మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతటి కృతనిశ్యయంతో ఉన్నదో తేటతెల్లం అవుతోంది. చంద్రబాబుతో కుమ్మక్కు అయి ఏపీలో రాజకీయాలు నడుపుతున్నది కేవలం షర్మిల మాత్రమే…

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిన అపకీర్తి పాల్జేయడానికి తద్వారా చంద్రబాబునాయుడుకు మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతటి కృతనిశ్యయంతో ఉన్నదో తేటతెల్లం అవుతోంది. చంద్రబాబుతో కుమ్మక్కు అయి ఏపీలో రాజకీయాలు నడుపుతున్నది కేవలం షర్మిల మాత్రమే కాదు. యావత్తు కాంగ్రెస్ పార్టీ కూడా అనే సంగతి అర్థమవుతోంది.

ఎందుకంటే.. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా అదే తరహాలో మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా దక్కకపోవడానికి పూర్తి పాపాన్ని జగన్ మీదకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. కేంద్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉన్నటువంటి చంద్రబాబు వైఫలక్యాలను కనీసం ప్రస్తావించకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్బుద్ధికి నిదర్శనంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ప్రత్యేకహోదా అంశాన్ని పెట్టి ఉంటే గనుక.. రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేదని.. హోదా రాకపోవడానికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్ ది మాత్రమే అని రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి జగన్ కూడా తన ప్రసంగంలో ఇదే సంగతి చెప్పారు. ఈ పాపం కాంగ్రెసుదే అని అన్నారు.

వీటికి కౌంటర్ గానా? అన్నట్లు పార్టీ ఏపీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ నోరు విప్పారు. కేంద్రం ప్రవేశ పెట్టిన అనేక బిల్లులకు బేషరత్తుగా అనుకూల ఓటింగ్ చేయడం ద్వారా.. ముఖ్యమంత్రి జగన్ 15 సార్లు ప్రత్యేకహోదా సాధించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారట. అనుకూల ఓటింగు వేయకుండా ఉంటే అప్పుడే హోదా వచ్చేసేదిట. ఇలా పూర్తిగా జగన్ మీదనేబురద చల్లేలా ఆయన కాకమ్మ కబుర్లు చెబుతున్నారు.

రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వైసీపీ కొన్ని బిల్లుల విషయంలో ఓటు చేసిన మాట నిజమే. కానీ, వైసీపీ ఓటు చేయకపోతే ఆ బిల్లులు వీగిపోయేంత పరిస్థితి మాత్రం లేదు. అందుకనే జగన్ అనుకూల ఓటు వేశారు తప్ప.. మరొకటి కాదు. కేంద్రంతో సత్సంబంధాల ద్వారా రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చుకోడానికే ప్రయత్నించారు. లోక్ సభలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతుకోసం తమమీద ఆధారపడే పరిస్థితి వస్తే తక్షణం హోదా వస్తుందనే మాట జగన్ తాజాగా శాసనసభలో కూడా చెప్పారు. కానీ ఆ అవకాశం రాలేదు.

మాణిక్యం ఠాగూర్.. ఏపీకి హోదా విషయంలో కాంగ్రెస్ చేసిన పాపాన్ని ప్రస్తావించకుండా.. జగన్ ను నిందించడం చవకబారుగా ఉంది. చట్టంలో ఆ మాట ఉండి ఉంటే.. కనీసం సుప్రీం కోర్టులో న్యాయపోరాటం ద్వారా హోదా సాధించుకుని ఉండేవాళ్లం అన్న జగన్ మాటలను ఆయన ఎలా కాదనగలరు? ఏం సమాధానం చెబుతారు?