గీతా ఆర్ట్స్ లో బోయపాటి ఏం చేస్తున్నారు? అఖండ తరువాత గీతా ఆర్ట్స్ కు సినిమా చేయాల్సి వుంది. దాన్ని అధికారికంగా స్టేజ్ మీదే ప్రకటించారు అల్లు అరవింద్. కానీ అలా చేయకుండా మధ్యలో రామ్ తో చిట్టూరి శ్రీనుకు ఓ సినిమా చేసారు.
బాలకృష్ణతో ఓ పొలిటికల్ సినిమా ఎన్నికల ముందు చేయడం కోసం ఫిక్స్ అయ్యారని, అందుకే మధ్య గ్యాప్ లో రామ్ సినిమా చేస్తున్నారని టాక్ వచ్చింది. ఆ పొలిటికల్ సినిమాను 14 రీల్స్ బ్యానర్ లో చేస్తారు అన్నది వినవచ్చిన వార్తల సారాంశం. 14రీల్స్ బ్యానర్ అధినేతల మీద అభిమానంతో, ఆ బ్యానర్ కే చేయాలని బాలయ్య గట్టిగా ఫిక్స్ అయ్యారని వార్తలు వినవచ్చాయి.
కానీ అక్కడి నుంచే తెరవెనుక వ్యవహారాలు మొదలయ్యాయి. కొంత మంది నిర్మాతలు బోయపాటికి టచ్ లోకి వెళ్లి, తమ బ్యానర్ కూడా దానికి జోడించేలా చేయమని కోరారని గ్యాసిప్ లు వినవచ్చాయి. దీనికి గాను బోయపాటికి మంచి రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసాయని కూడా వార్తలు వినిపించాయి. మొత్తానికి ఏమైతేనేం రామ్ సినిమా పూర్తి చేయడం, ఆ తరువాత స్క్రిప్ట్ కు ఆరు నెలలు టైమ్ పడుతుంది. ఈ లోగా ఎన్నికలు వస్తాయి కనుక బాలయ్య అవైలబుల్ గా వుండరు కనుక ఆ సినిమాను అలా అబేయన్స్ లో వుంచేసినట్లుంది.
ఈలోగా అరవింద్ పాత కమిట్ మెంట్ తెరమీదకు వచ్చింది. బోయపాటి గీతాలో తేలారు. బన్నీతో సినిమా అనే టాక్ మొదలైంది. కాదు. సూర్యతో సినిమా అని ఇంకో టాక్. కాదు కాదు బాలయ్యతోనే కబుర్లు. నిజానికి గీతాకు బాలయ్యతో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో వుంది. వాళ్ల దగ్గర సూర్య డేట్ లు వున్నాయి. బన్నీ-బోయపాటి సినిమా అని వార్తలు వున్నాయి కానీ బన్నీ ఎప్పుడు ఫ్రీ అవుతారు పుష్ప సినిమా నుంచి అన్నది క్లారిటీ లేదు. పైగా పుష్ప సినిమా మూడు భాగాలు అని వినిపిస్తోంది. అందువల్ల బోయపాటిని అటు సూర్య కు లేదా ఇటు బాలయ్యకు లాక్ చేసే అవకాశం వుంది.
మరి బాలయ్య ఇప్పుడే బోయపాటితో సినిమా చేసేస్తే, వెంటనే మళ్లీ అదే బోయపాటితో చేస్తారా? అన్నది అనుమానం. అంటే 14 రీల్స్ తో చేసే సినిమాకు మళ్లీ గ్యాప్ వస్తుంది. ఈ లెక్కన 2026 వస్తుందేమో? 2024 లో బోయ-గీతా-బాలయ్య సినిమా అంటే, 2025లో వేరే హీరోతో సినిమా చేస్తే 2026లో 14 రీల్స్ సినిమా అనుకోవాలేమో? ఇదంతా చూస్తుంటే బోయపాటి కి ఇష్టం లేనట్లు కనిపిస్తోంది.