సింహాద్రి అప్పన్న చందనోత్సవం తేదీలు దాదాపు 3-4 నెలల ముందే ఖరారవుతాయి. ఎంత నిదానంగా ఏర్పాట్లు చేసినా ఉత్సవం టైమ్ కు అంతా సిద్ధమౌతుంది. కానీ కీలకమైన గోడను మాత్రం సరిగ్గా చందనోత్సవానికి 4 రోజుల ముందు కట్టారు.
కాంట్రాక్టర్ లక్ష్మణరావు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. సరిగ్గా చందనోత్సవానికి కొన్ని రోజుల ముందు అధికారులు తనను సంప్రదించారని, గోడ కట్టాలని ఆదేశించారని వెల్లడించాడు కాంట్రాక్టర్.
ఇంత తక్కువ టైమ్ లో గోడ కట్టడం సాధ్యంకాదని చెప్పినా వినలేదని, తాత్కాలికంగా నిర్మించాలని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో, చందనోత్సవానికి 4 రోజుల ముందు గోడ కట్టానని వెల్లడించాడు కాంట్రాక్టర్. ఇదే గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు.
ఈ ఘటనపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ముందు లక్ష్మణరావు ఈ కీలక విషయాన్ని వెల్లడించారు. మరోవైపు చందనోత్సవానికి 2 నెల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం, కీలక మంత్రులు ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు మంత్రులు ఏర్పాట్లను పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యేలు దీనికి అదనం. అంతా కలిసి ఎన్నో రివ్యూ మీటింగ్స్ పెట్టారు.
ఏ మీటింగ్ లో చర్చకు రాని గోడ అంశం సరిగ్గా ఉత్సవానికి 4 రోజుల ముందు ఎందుకొచ్చింది? ప్రభుత్వ పెద్దలు ఆదేశించకుండా, అధికారులు ఎందుకంత పెద్ద పని తలకెత్తుకుంటారు? అసలు గోడ కట్టాలని నిర్ణయించిన మంత్రి ఎవరు, దాన్ని ఆమోదించిన అధికారి ఎవరు? గోడ కట్టినప్పుడు సంబంధిత ఇంజనీర్ అక్కడ ఉన్నారా లేరా?
కట్టిన గోడలో నాసిరకమైన ఇటుకలు ఎందుకు వాడారు? చేత్తో నలిపితే పిండి అయిపోయేలా ఉన్న ఇటుకల్ని వాడమని ఎవరు చెప్పారు? అసలు ఈ గోడ నిర్మాణానికి కేటాయించిన మొత్తం డబ్బు ఎంత? బిల్లులు పెంచుకునేందుకే ఆఖరి నిమిషంలో గోడ అంశాన్ని తెరపైకి తెచ్చారా? ఈ ప్రశ్నలకు జవాబులు తేలాల్సి ఉంది.
కమిటి కి చెప్పిన విషయాలు నీకు ఎలా తెలిసింది .. ??
tv livelo chuparu, chudaleda
అంతా జగన్మాయా.. రివర్స్ టెండరింగ్ మహిమ .. అధికారికి ప్యాలెస్ లో బట్టలూడదీసి చేసిన సర్వీస్ ఫలితం .. గోవిందా గోవిందా
Neeyammani reverselo denge mahima p4mushtilanjaakodaka
Eenadu , ABN cheppindhi raa konkisga edha a
che, denemma jeevitham,
athi-manchi thanam athi nijayathee ledu ka batti goda koolindi !!!
Charitha lo anadu leni anthaga 5 ministers committee tho review chesyam
Pressmeets anithamma a kartha karma kriya

Sorry amma ante madam inko definition cheptharu kadha
so madam