విశాఖలో ఎంట్రీ ఇచ్చిన కొత్త కరోనా

కరోనాలో కొత్త రకం ఇపుడు భయపెడుతోంది. చైనాను వణికిస్తూ అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియెంట్ ని మోసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడని వైద్యాధికారులు చెబుతున్నారు. విశాఖకు చెందిన ముప్పయి మూడేళ్ల వ్యక్తి దుబాయి…

కరోనాలో కొత్త రకం ఇపుడు భయపెడుతోంది. చైనాను వణికిస్తూ అతలాకుతలం చేస్తున్న కరోనా కొత్త వేరియెంట్ ని మోసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడని వైద్యాధికారులు చెబుతున్నారు. విశాఖకు చెందిన ముప్పయి మూడేళ్ల వ్యక్తి దుబాయి వెళ్ళి ఈ నెల 15న విశాఖకు తిరిగి వచ్చారు.

ఆయనకు ఆ తరువాత జ్వరం రావడంతో ఒక ప్రైవేట్ ఆసుపతిలో చేర్పించారు. 16న ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు. అందులో పాజిటివ్ వచ్చింది. ఆ శ్యాంపిల్ ని సీసీఎంబీకు పంపారు. ఆయనకు ఒమిక్రాన్ వేరియెంట్ గా నిర్ధారణ అయినట్లుగా తాజాగా వెల్లడైంది.

అయితే ఆయన ఈ నెల 22నే ప్రైవేట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారుట. ఇపుడు వైద్యాధికారులు ఆయన్ని తమ పర్యవేక్షణలోనే క్వారంటైన్ లో ఉంచారు. ఈ కొత్తరకం వేరియెంట్ విశాఖకు ఎంట్రీ ఇవ్వడంతో కొత్త భయం కూడా మొదలైంది.

ఈ మధ్య దాకా జీరో నంబర్ తో కరోనా కేసులు ఉన్నాయి. నిన్నటికి నిన్న ఒకటి రెండు కేసులు కొత్తగా వచ్చాయి. అయితే కొత్త రకం వేరియెంట్ కేసులు మాత్రం ఇదొకటే అని అంటున్నారు వైద్యాధికారులు. విశాఖ నుంచి రోజూ ఇతర రాష్ట్రాలకు దేశాలకు ట్రావెల్ చేసేవారు ఉన్నారు. దాంతో ఇపుడు కరోనా వణుకు అయితే మెల్లగా మొదలవుతోంది.