ఉత్తరాంధ్రాలో బాబు పోటీ…. ఆహ్వానిస్తున్నది తమ్ముడు కాదు…!

చంద్రబాబు కుప్పం నుంచే పోటీకి ఈసారి దిగుతారు అని అంటున్నారు. బాబు కూడా తనకు ఓటమి అందించని కుప్పం మీదనే మనసు పారేసుకుంటారు. అయితే ఈసారి బాబు రెండవ సీటు నుంచి పోటీ చేస్తారు…

చంద్రబాబు కుప్పం నుంచే పోటీకి ఈసారి దిగుతారు అని అంటున్నారు. బాబు కూడా తనకు ఓటమి అందించని కుప్పం మీదనే మనసు పారేసుకుంటారు. అయితే ఈసారి బాబు రెండవ సీటు నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం ఒక వైపు సాగుతోంది. అది గోదావరి జిల్లాల నుంచి ఉండవచ్చు అని అంటున్నారు. అయితే బాబుని కుప్పం వదిలి ఉత్తరాంధ్రా నుంచి పోటీ చేయమని ఆహ్వానిస్తున్నది సొంత పార్టీ వారు కాదు రాజకీయ ప్రత్యర్ధులు.

బాబు ఈసారి తల్లకిందులుగా తపస్సు చేసినా గెలిచేది లేదని డిక్లేర్ చేసేశారు శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్, మాజీ డిప్యూటీ సీఎం అయిన ధర్మాన క్రిష్ణదాస్. ఆయన ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా ఓటమి మాత్రం ఆయనదే అని తేల్చేశారు.

ప్రజలు వైసీపీని గెలిపించడానికి ఎపుడో డిసైడ్ అయిపోయారు అని ధీమాగా ఆయన చెబుతున్నారు. చంద్రబాబుకు సత్తా ఉంటే నరసన్నపేటలో తన మీద పోటీ చేసి గెలవాలని ఒక అందమైన సవాల్ ని కూడా క్రిష్ణదాస్ విసిరారు. తాను రెడీగా ఉన్నానని ఆయన ప్రకటించారు. టీడీపీకి అంత బలం ఉంటే బాబు తనను ఓడించాలని ఆయన అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ప్రభంజనం అంటున్న చంద్రబాబుకు ఇది చిత్రమైన సవాల్ గానే చూడాలని అంటున్నారు. బాబు కుప్పం వదిలి ఎటూ రారు, రెండవ సీటు కోసం సెర్చ్ చేస్తున్నారు. ఆయన్ని ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం నుంచి పోటీకి వైసీపీ నేత ఆహ్వానిస్తున్నారు. బాబు ఓకే అంటారా లేదా అన్నదే ఆసక్తికరమైన విషయంగా ఉంది. నరసన్నపేటలో టీడీపీకి ఇద్దరు అభ్యర్ధులు రేసులో ఉన్నారు. వర్గ పోరు బాగానే ఉంది.

ఇక్కడ ధర్మాన కుటుంబానికి బలం ఉంది. కంచుకోట లాంటి సీటు. అందుకే తెలివిగానే క్రిష్ణదాస్ నా మీద గెలిచి చూడు బాబూ అని చాలెంజి విసిరారు అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఇరవై వేలకు పైగా భారీ మెజారిటీతో గెలిచిన క్రిష్ణదాస్ ఈసారి ఆ మెజారిటీని దాటుతాను  అంటున్నారు. చంద్రబాబు నరసన్నపేటకు వస్తారా..ఏమో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు కాబట్టి ఈ సవాల్ టీడీపీ పెద్ద్దల మదిలో పదిలంగా ఉంటుందని అంటున్నారు.