MISS INDIA పోటీల‌కు క‌డ‌ప నుండి డాక్ట‌ర్ చంద‌న‌

వైద్య వృత్తిని ఎంచుకున్న చాలా అమ్మాయిలు అదే వృత్తిలో సేవ‌లు అందించాల‌ని అనుకుంటారు కానీ ఇక్క‌డ MISS INDIAని ఎంచుకున్న ఒక డాక్ట‌ర్ గురించి తెలుసుకుందాము. Advertisement చిన్న‌ప్ప‌టి నుండి విద్యావంతుల కుటుంబంలో పుట్ట‌డం…

వైద్య వృత్తిని ఎంచుకున్న చాలా అమ్మాయిలు అదే వృత్తిలో సేవ‌లు అందించాల‌ని అనుకుంటారు కానీ ఇక్క‌డ MISS INDIAని ఎంచుకున్న ఒక డాక్ట‌ర్ గురించి తెలుసుకుందాము.

చిన్న‌ప్ప‌టి నుండి విద్యావంతుల కుటుంబంలో పుట్ట‌డం వాళ్ళ త‌న నాన్న ఇంజినీరు అయ్యిన‌టువంటి అంబ‌టి శ్రీనివాసుల రెడ్డి గారు ఇంకా అమ్మ అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ అయిన డాక్ట‌ర్ ల‌క్ష్మి దేవి గారిని చూసి చ‌దువుపై మ‌క్కువ‌తో డాక్ట‌ర్ అవ్వాలి అని ప‌ట్టుద‌ల‌తో డాక్ట‌ర్ అయ్యారు.

ఇప్పుడు డాక్ట‌ర్ గా త‌న సేవ‌ల‌ను మ‌రింత విసృతంగా అందిచాల‌న త‌ప‌న‌తో Femina Miss India 2022 వైపు అడుగులు వేశారు డాక్ట‌ర్ చంద‌న అంబ‌టి. తోలి ప్ర‌య‌త్నంలోనే ఆంధ్ర నుండి టాప్ 8 semifinalist గా ఎంపిక అయ్యారు ఈ ముద్దుగుమ్మ‌. ఒక వైపు వైద్య వృతిని కొన‌సాగిస్తూ మ‌రో వైపు అందాల పోటీల‌కు  సంసిద్ధం అవుతున్నారు.

ఇలా ప్ర‌తి రాష్ట్రం నుండి ఎంపికైన స్టేట్ పైన‌లిస్టుల‌తో ముంబై న‌గ‌రంలో ఆడిష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. అన్ని రాష్ట్ర‌ల నుండి పాల్గొంటున్న అంద‌మైన అమ్మాయిల నుండి ముప్పై ఒక మందిని ఎంపిక చేస్తారు. మ‌రి ఈ డాక్ట‌ర్ టాప్ 31 లిస్ట్లో సంపాదించుకుంటారో లేదో అని కొద్దీ రోజులో తేలిపోతుంది. వైద్య వృత్తిలో విశేష‌మైన సేవ‌లు అందించ‌డ‌మే కాకుండా ఫాష‌న్ రంగంలో కూడా విజేత‌గా నిల‌వాల‌ని ఆశీర్వాద్దిదాము.