నకిలీ కాపు పవన్.. అల్టిమేట్ కామెంట్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి నకిలీ కాపు అని హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమాలకు ఏనాడూ సహకరించని పవన్…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి నకిలీ కాపు అని హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపు ఉద్యమాలకు ఏనాడూ సహకరించని పవన్ కాపుల ఉద్ధార్కుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.

బాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ సినిమాల్లో యాక్షన్, రాజకీయాల్లో ఓవరాక్షన్ చేస్తున్నారని విమర్శించారు. కాపు నేత వంగవీటి రంగా హత్యకు, ముద్రగడ పద్మనాభం మీద జరిగిన దారుణాలకు నారా చంద్రబాబు నాయుడు బాధ్యుడని తెలిసిన ఏనాడు వాటిని ఖండించని పవన్ కళ్యాణ్ చెబితే ప్రజలు తెలుగుదేశానికి ఓటు వేస్తారా అని ప్రశ్నించరు.

కాపు ఉద్యమానికి ఏనాడూ మద్దతు తెలపని పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు విశ్వసించరని అమర్నాథ్ అన్నారు. పవన్ పుణ్యమాని జనసైనికులు జెండా కూలీలుగానే మిగిలిపోనున్నారని అమర్నాథ్ సెటైర్లు వేశారు. ఇప్పటికైనా జనసేన పార్టీని టిడిపిలో విలీనం చేస్తే మంచిదని సూచించారు.

వచ్చే ఎన్నికల్లో రెండు జెండాలు పట్టుకుని తిరిగే కన్నా 175 స్థానాల్లో టిడిపి జెండా పట్టుకుని తిరిగితే సరిపోతుంది అని అమర్నాథ్ సలహా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే కనీసం కాపులు ఆయన గురించి ఆలోచించే వారిని బాబును భుజాన్ని ఎత్తుకోవడంతో పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతోందని అమర్నాథ్ జోస్యం చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాపులకు ఇచ్చిన గుర్తింపు మరెవరు ఇవ్వలేదని అమర్నాథ్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో  ఐదుగురు మంత్రులు, ఆయన టీం లో 30 మంది ఎమ్మెల్యేలు, జడ్పిటిసి, ఎంపీటీసీలు కాపులే ఉన్నారని అమర్నాథ్ గుర్తు చేశారు. జగన్ మాత్రమే అన్ని వర్గాలకు న్యాయం చేసే నాయకుడు అని గుడివాడ అంటున్నారు.