జగన్ పై ఈనాడుది ‘నిర్దిష్టమైన’ ఏడుపు!

రహదార్లకు పక్కనే ఉండే స్థలాల మార్కెట్ విలువను పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని అందించింది. Advertisement ప్రభుత్వంలో ఆలోచన దశలోనే ఉన్న, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలను.. ముందుగానే పసిగట్టి వార్తా…

రహదార్లకు పక్కనే ఉండే స్థలాల మార్కెట్ విలువను పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నదంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని అందించింది.

ప్రభుత్వంలో ఆలోచన దశలోనే ఉన్న, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలను.. ముందుగానే పసిగట్టి వార్తా కథనాలుగా అందించడం అనేది గొప్ప విషయమే. జర్నలిజం ప్రమాణాల ప్రకారం అందుకు అభినందించాలి. వారి సామర్థ్యాన్ని ప్రశంసించాలి.

అయితే వారు ముందుగా పసిగట్టి అందించే ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రజాకంటక అంశాలున్నప్పుడు వాటిని ఎండగడితే బాగుంటుంది. అలా కాకుండా.. తమకు ముందుగా సమాచారం తెలిసింది కదాని.. మంచీ చెడూ చూసుకోకుండా.. అడ్డగోలు రాతలు రాసేస్తే.. విధాన పరంగా ప్రభుత్వం తీసుకునే సాధారణ నిర్ణయాలపై కూడా అసాధారణమైన రీతిలో దుమ్మెత్తి పోస్తే వారి పరువే పోతుంది. 

రాష్ట్రప్రభుత్వం.. రహదార్ల వెంబడి ఉండే స్థలాల మార్కెట్ విలువను పెంచాలని నిర్ణయం తీసుకుంటోంది అనేది కథనం. దీనిద్వారా ఇప్పటిదాకా వస్తున్నదానికంటె ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది! అయితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేస్తే.. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం సజావుగా పరిపాలన సాగిస్తే.. తాము సహించలేం అన్నట్లుగా ఈనాడు ఇంకా బయటకు రాని నిర్ణయంపై ఏడుపులు ప్రారంభించేసింది.

మామూలుగా ఊర్లలో ఉండే స్థలాలకు, రహదార్లకు పక్కనే ఉండే స్థలాలకు మార్కెట్ విలువలో తేడా ఉంటుందా? ఉండదా? అని అడిగితే.. పసిపిల్లలు కూడా టక్కున జవాబు చెప్తారు. రహదార్ల వెంబడి ఉండే స్థలాలు నాలుగైదు రెట్లు అధికధరను కలిగి ఉంటాయి. అందరికీ తెలిసిన సంగతి ఇది. అయితే.. వాటికి నామమాత్రంగా అధికారిక మార్కెట్ ధరను పెంచాలని ప్రభుత్వం సంకల్పిస్తే.. ఈనాడుకు ఇంత ఏడుపు ఎందుకో అర్థం కావడం లేదు. 

భూముల మార్కెట్ విలువను పెంచడంలో సంప్రదాయం పాటించడం లేదని, నిర్దిష్టమైన విధానం లేదని ఈనాడు విలపిస్తోంది. వారు చెబుతున్న సంప్రదాయం ప్రకారం.. ప్రతి ఏడాది ఆగస్టు 1న మాత్రమే మార్కెట్ విలువలను పెంచాలట. అది నిజమే. చివరిసారిగా 2020లో పెంచారని, 2021లో పెంచలేదని కూడా ఈనాడే రాస్తోంది. మరి ఏడాది విరామం తర్వాత.. 2022లో పెంచుతోంటే ఏడుస్తున్నారు ఎందుకు?

ఇంకో సంగతి. రేట్ల పెంపులో ఓ నిర్దిష్ట విధానం లేదని ఈనాడే రాస్తోంది. రకరకాల అంశాలు పరిగణనలోకి తీసుకుని విభజించిన గ్రిడ్ ఆధారంగా మార్కెట్ విలువల సవరణకు ప్రయత్నాలు జరిగాయని కూడా ఈనాడే రాస్తోంది. ఆ చర్యలు మరుగున పడ్డాయని కూడా రాసింది. అంటే అలా గ్రిడ్ ల ప్రకారం క్రమబద్ధీకరించడం వారి దృష్టిలో నిర్దిష్టమైన విధానం అవుతుందన్నట్టే. 

మరి ఇప్పుడు రహదార్లను ఆనుకుని ఉండే స్థలాల మార్కెట్ విలువ పెంచడం ఈనాడు రాతల ప్రకారం నిర్దిష్టతకు దారివేస్తున్నట్టే కదా? క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటున్నట్టే కదా? దీనిని హర్షించాల్సింది పోయి.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేస్తే.. వారు పరిపాలన సవ్యంగా చేస్తే.. ఓర్వలేం అన్నట్టుగా ఇలాంటి తప్పుడు రాతలు రాయడం ఎందుకు అని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు.