కొత్త జర్నలిజం ప్రమాణాలు నెలకొల్పుతున్న ఈనాడు!

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించిన ప్రహరీ మరియు మరుగుదొడ్లు ఉంటే వాటిని జేసీబీతో కూల్చివేయడం జరిగింది. ఈ సంఘటనకు చాలా కోణాలున్నాయి.  Advertisement ఆ ఇళ్లు న్యూస్‌టుడే అనగా…

అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని నిర్మించిన ప్రహరీ మరియు మరుగుదొడ్లు ఉంటే వాటిని జేసీబీతో కూల్చివేయడం జరిగింది. ఈ సంఘటనకు చాలా కోణాలున్నాయి. 

ఆ ఇళ్లు న్యూస్‌టుడే అనగా ఈనాడు కోసం పనిచేసే విలేకరిది. కాబట్టి ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం తప్పు అన్నట్టుగా ఈనాడు ఓ పెద్ద కథనాన్ని ప్రచురించింది.

జేసీబీ తీసుకువచ్చి కూల్చివేయడం అనేది రెవెన్యూ అధికారులు చేసే పని. అలాంటి పని చేస్తున్నప్పుడు స్థానికంగా ప్రజలు ప్రతిఘటించే అవకాశం ఉంటుంది గనుక.. వారు పోలీసుల సాయం కూడా తీసుకుంటారు. అయితే ఈనాడు విలేకరి అక్రమ నిర్మాణాలను (ఇంటిని కాదు) కూల్చేసిన సంఘటన గురించి ఈనాడు రాసిన వార్త చాలాచిత్రంగా ఉంది. చాలా అతి తెలివితేటలతో ఆ వార్త రాశారు.

‘‘జేసీబీతో వచ్చిన వైకాపా నాయకులు ఆయన ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని కూల్చివేశారు. పక్కాగా నిబంధనల మేరకు నిర్మించిన ఇంటిని.. రోడ్డు స్థలాన్ని ఆక్రమించి కట్టారని ఆరోపిస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. వైకాపా నాయకుల ఆరోపణలే ఆధారంగా కూల్చివేతల పర్వం కొనసాగింది.’’

ఈనాడు వార్తలో ఉన్న వాక్యాలు ఇవి. వైకాపా నాయకులు కూల్చేశారని ఒకవైపు అంటూనే, వారి ఆరోపణల మేరకు కూల్చవేతలు జరిగాయనడం ఏంటో అర్థం కాని సంగతి. కార్యక్రమం నడిపించే రెవెన్యూ పోలీసు అధికారుల్ని ఈ వార్తలో సాక్షులుగా చిత్రీకరించి రాయడం విశేషం.

ఇదంతా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నందుకు వైసీపీ వాళ్లే కక్ష సాధింపుగా చేశారట. ఇప్పటికే చాలా సార్లు ఫోనుల్లో బెదిరించారట. మరి సదరు విలేకరి బెదిరింపు ఆడియో రికార్డింగులు బయటపెట్టవచ్చు కదా. విలేకరిగా ఆయనకు ఆ తెలివితేటలు ఉంటాయి కదా. అయినా.. కక్ష సాధింపు చేయదలచుకుంటే.. ఏకంగా ఇంటినే కూల్చేస్తారు కదా.. ప్రహరీని, మరుగుదొడ్డిని మాత్రం ఎందుకు కూలుస్తారు? అనేది బుర్రున్నవాళ్లకు అనిపించే ప్రశ్న.

కోర్టులో స్టే ఉన్నదనేది ఒక్కటీ.. సదరు ఈనాడు విలేకరిగారి బలం. స్థలం గురించిన ఖచ్చితమైన లెక్కలు చూపడానికి ఇదేమీ ఆయన స్వార్జితమూ, పిత్రార్జితమూ కాదు. 1998తో ప్రభుత్వమే ఇచ్చిన స్థలం.. సదరు విలేకరి తన పరపతి ఉపయోగించి రోడ్డు పక్కన ఉండే స్థలాన్ని భార్య పేరుతో తీసుకున్నారు. ఈ మాత్రం విలేకర్ల దందాలు, అరాచకాలు చాలా మామూలే. 2004లో ప్రభుత్వం పక్కా ఇళ్లు మంజూరుచేస్తే కట్టుకున్నారు. సదరు విలేకరి ఇంటితో పాటూ.. రోడ్డును కూడా ఆక్రమించి ప్రహరీ కట్టుకున్నారు. 

2014 సర్పంచి ఫిర్యాదుచేయడంతో ఇది వివాదం అయింది. వారికి నోటీసులు ఇచ్చారు. మరికొందరి సహా విలేకరి గారు కూడా కలిసి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఆ మరికొందరు ఆక్రమణల దారుల్లో ఎందరు విలేకరులున్నారో తెలియదు. మొత్తానికి స్టే రూపంలో.. జీవితం మొత్తం యథేచ్ఛగా గడిపేయవచ్చునని వారు డిసైడయ్యారు. ఆరేళ్లుగా ఏమీ జరగలేదు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి ఆక్రమణల్లోని ప్రహరీని కూల్చివేసేసరికి.. గోల చేస్తున్నారు.

ముందే చేయాల్సిన సర్వేను, కూల్చివేత తర్వాత అధికారులు సర్వే చేశారని వార్తలు రాశారు గానీ.. ఆ సర్వేలో ఆక్రమణలు అబద్ధం అని.. ప్రెవేటు స్థలాన్ని కూల్చేశారని వార్తలో రాయలేదు. అంటేకూల్చివేతలు కరెక్టే అన్నమాట. ఇలాంటి అర్థసత్యాలతో, వక్రీకరణ సత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి నీచమైన ఎత్తుగడలకు ఈనాడు పాల్పడుతున్నట్టుగా అర్థమవుతోంది.