ఓటమి భయమా? అందుకే ఇల్లు కట్టుకుంటున్నాడా? 

మొండిగా ఉండే మనుషులు కూడా ఒక్కోసారి భయపడి కొన్ని పనులు చేస్తుంటారు. సామాన్యులకంటే రాజకీయ నాయకులకు భయాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని భయాల్లో కంటే ఎన్నికల్లో ఓటమి భయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ…

మొండిగా ఉండే మనుషులు కూడా ఒక్కోసారి భయపడి కొన్ని పనులు చేస్తుంటారు. సామాన్యులకంటే రాజకీయ నాయకులకు భయాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని భయాల్లో కంటే ఎన్నికల్లో ఓటమి భయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఒక ఇమేజ్ఉన్న నాయకుడికి అందులోనూ ఒక పార్టీ అధినేతకు ఇంకెంత భయం ఉండాలి? అదీగాకుండా అసెంబ్లీ ఎన్నికలు మీదికి ఉరికొస్తున్నాయి. ఇంతకూ ఇలా భయపడుతున్న దిగ్గజ నాయకుడు, పార్టీ అధినేత ఎవరయ్యా అంటే వచ్చి ఎన్నికల్లో అధికారం తనదేనని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు.

ఇంతకూ ఆయన భయపడిపోయి ఏం పనిచేస్తున్నాడు? తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నాడు. ఎన్నికలు మరో రెండేళ్లలో జరుగుతుండగా హడావుడిగా ఈ పని మొదలు పెట్టాడు. కుప్పంలో సొంత ఇల్లు లేకపోతే ఓడిపోతాననే భయం ఉన్నట్లుగా ఉంది. అదేగాకుండా విమర్శలను కూడా తట్టుకోలేకపోతున్నాడు. గతానికి భిన్నంగా ఈ సారి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఏ ఎన్నికల సమయంలోనూ కుప్పం వైపు చూడని ఆయన.. ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే సొంత నియోజకవర్గంపై ఫోకస్ ఎందుకు చేస్తున్నారు ..? సాధారణంగా కుప్పం అంటే చంద్రబాబు అడ్డా. అక్కడ ఆయనకు పోటీ లేదు.. సుమారు 3 దశాబ్దాలకు పైగా.. కుప్పం  ప్రజలు బాబును ఆదరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో.. ఆశీర్వదిస్తున్నారు. 

కానీ అక్కడ ఆయనకు సొంత ఇల్లు లేదు. పార్టీ ఉనికి లేని హైదరాబాదులో మాత్రం కోట్ల కూపాయల ఖర్చుతో ఇల్లు కట్టుకున్నాడు. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు షాక్ ఇచ్చాయి. దీంతో సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెంచారు. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో తగిలిన షాక్‌తో.. ఇప్పటి నుంచే కుప్పంలో సైకిల్‌కు రిపేర్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు.. త్వరలోనే అక్కడ సొంతిల్లు కూడా నిర్మించుకోబోతున్నాడు. ఇంతలా.. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టడానికి రీజనేంటి? కుప్పం.. బాబులో టెన్షన్ పుట్టిస్తోందా? కుప్పం లోకల్ బాడీ ఎలక్షన్స్‌ లో వచ్చిన  రిజల్ట్‌తో చంద్రబాబు అలర్ట్ అయ్యాడు అంటున్నారు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా సీరియస్‌గా తీసుకోకపోతే.. తన సీటుకే ఎసరొస్తుందని ఆయన భావిస్తున్నాడనే ప్రచారం ఉంది.

అన్నిటికన్నా ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి కూడా కుప్పంపై నిత్యం ఫోకస్ చేస్తున్నారు. ఇదే సమయంలో సీఎం జగన్  కూడా అప్పుడప్పుడు కుప్పం ప్రస్తావన తీసుకొస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడ్ని తన సొంత నియోజకవర్గంలో ఓడిపోతున్నారనే ప్రచారం చేయగలిగితే అ ప్రభావం మొత్తం టీడీపీపై ఉంటుందని.. ఇక కుప్పంలో  గెలిస్తే.. ఇక చంద్రబాబుకు రాజకీయ జీవితం తెరపడుతుంది అన్నది వైసీపీ ప్లాన్ .  చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సొంతింటి నిర్మాణానికి అవసరమైన రిజిస్ట్రేషన్‌ పనులు శనివారం పూర్తయ్యాయి. 

చంద్రబాబు పీఏ మనోహర్‌ ఇంటి నిర్మాణ ప్రతిపాదిత స్థలానికి సంబంధించి అవసరమైన పత్రాలను  కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ విజయ్‌కుమార్‌కు అందించారు. వాటిని పరిశీలించి విక్రయదారుల నుంచి రిజిస్ట్రేషన్‌ చేయించారు. చంద్రబాబు పీఏ మనోహర్‌ మాట్లాడుతూ.. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ కదిరిఓబనపల్లె వద్ద గల సరే నెం.7-6లోని 2.05 ఎకరాల భూమిని ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు చెప్పారు. భాగాలుగా ఉన్న భూమికి సంబంధించి మూడు దస్త్రాలను తయారు చేయించి రిజిస్ట్రేషన్‌ చేయించారు. కాగా ఈ నెలలో ఇంటి నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు కుప్పానికి రానున్నట్లు సమాచారం.