ఈ నెల 11న ప్రధానమంత్రి నరేన్ర మోడీ విశాఖ వస్తున్నారు. ఆ రాత్రికి ఆయన నేవీ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. మరుసటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో కలసి విశాఖలోని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఏయూలో జరిగే బహిరంగ సభను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ సభ నిర్వహణ భారం అంతా వైసీపీ వేసుకుంది.
మోడీ సభను లక్షల మందితో జరిపించడానికి వైసీపీ వ్యూహరచన చేస్తోంది. యాభై ఏళ్ల ఉత్తరాంధ్రా వాసుల కోరిక అయిన రైల్వే జోన్ కి ప్రధాని మోడీతో కలసి ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్న నేపధ్యంలో పొలిటికల్ మైలేజ్ ని తన వైపుగా మళ్లించుకోవడానికి వైసీపీ చూస్తోంది.
పైగా మోడీ ఫస్ట్ టైం విశాఖలో భారీ బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. ఆతీధ్య రాష్ట్రమైన ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. దాంతో మోడీ సభ సక్సెస్ చేయడం ద్వారా విశాఖ అభివృద్ధి విషయంలో తన పాత్రను చాటి చెప్పుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది.
విశాఖలో దాదాపుగా రెండు రోజుల పాటు మోడీ ఉంటారు. దాంతో విశాఖ మొత్తం ఆ రెండు రోజులూ ఖాకీల మయం అవుతోంది. కనీ వినీ ఎరగని తీరున ఏకంగా పన్నెండు మంది ఐపీఎ అధికారులు, అలాగే అయిదారు వేల మంది పోలీసులతో విశాఖ మొత్తం బందోబస్తుని గట్టిగా నిర్వహించనున్నారు.
ఒక ప్రధాని సభకు ఇన్ని వేల మంది పోలీసులను వినియోగించడం ఇంతకు ముందు ఎపుడూ లేదు. దాంతో పాటు రెండు రోజుల పాటు విశాఖ అంతా పోలీస్ వలయంలోకి వెళ్లిపోతోంది.