మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ విశాఖ జిల్లాలో కాదు విజయనగరం జిల్లాలోనే అని అంటున్నారు. ఆయన చీపురుపల్లి వెళ్లాల్సిందే అని అంటున్నారు. టీడీపీ మొత్తం 128 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించింది. ఇకా 16 మంది మాత్రమే మిగిలారు. అందులో చాలా మంది సీనియర్లకు ఈసారి చెక్ చెప్పేస్తారు అని అంటున్నారు.
గంటాకు మాత్రం టికెట్ ఇస్తున్నారు. అదే టైం లో ఝలక్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఆయన కోరుకున్న భీమిలీ టికెట్ ఇవ్వకుండా విశాఖకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చీపురుపల్లి నుంచే పోటీ చేయమని కోరుతున్నారు. టీడీపీ చివరి జాబితాలో గంటా పేరు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉంటుందని అంటున్నారు.
గంటా ఇపుడు ఎటు వెళ్తారు ఏమి చేస్తారు అన్నది తేల్చుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. గంటా టీడీపీ నుంచి జనసేనలోకి మారి భీమిలీ టికెట్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అయితే అది సాధ్యమా అన్నది కూడా రెండు పార్టీలలోనూ తర్కించుకుంటున్నారు.
భీమిలీలో పంచకర్ల సందీప్ ఉన్నారు. ఆయన జనసేన టికెట్ ని ఆశిస్తున్నారు. ఆయనకు పవన్ నుంచి హామీ ఉందని అంటున్నారు. అయితే సందీప్ తో పోల్చితే గంటా బలమైన అభ్యర్ధి అవుతారు అని అంటున్నారు. దాంతో గంటా జనసేన వైపు మళ్ళుతారా అన్నది కూడా అంతా అనుకుంటున్నారు. ఆయన వియ్యంకుడు భీమవరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు.
గంటాకు కూడా జనసేనలో లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు. టీడీపీ చీపురుపల్లి టికెట్ ని ధిక్కరించి గంటా చేరితే ఆ పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది.