గంటా రూటు మారుస్తున్నాడా ?

టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రూటు మార్చారు. జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంది.  Advertisement గడిచిన ఎన్నికల్లో వైసీపీ…

టీడీపీతో అంటీ ముట్టనట్టుగా ఉన్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రూటు మార్చారు. జనసేనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు ఆయన వ్యవహార శైలి కూడా అలానే ఉంది. 

గడిచిన ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనలో కూడా ఆయన టీడీపీ తరపున  గెలుపొందారు. కానీ వ్యాపారాలు, ఇతరత్రా ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో.. లేక అధికార పార్టీ నుంచి బెదిరింపులు వచ్చాయో ఏమో కానీ.. టీడీపీకి దూరంగా ఉన్నారు. 

ఆ మధ్యన పార్టీ కార్యాలయంలో చటుక్కున మెరిసినా.. అదే స్పీడులో మాయమైపోయారు. ఇప్పుడు మెగా జపం పఠిస్తున్నారు. జనసేనకు దగ్గరయ్యేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. 

ఎన్నికల అనంతరం గంటా  వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి, నాటి మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డుకట్ట వేశారని టాక్ నడిచింది. తరువాత అదిగో ఇదిగో అంటూ ముహూర్తాలు సైతం వెలువడ్డాయి. కానీ అవన్నీ ఉత్తమాటేనని తేలిపోయాయి. తరువాత బీజేపీలోకి వెళతారని ప్రచారం జరిగింది. కానీ కమలం గూటికి కూడా వెళ్లలేదు. 

అయితే ఇప్పుడు జనసేన గ్రాఫ్ పెరిగిందని తెలియడంతో ప్రజారాజ్యం పార్టీ పూర్వనేత రూటు మార్చారు. తన పూర్వ సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ పవన్ కు దగ్గరవ్వాలని చూస్తున్నారు.