ఉక్కుపై వేటు… సాక్ష్యమిదిగో !

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అంతటా ప్రచారంలో ఉంది. అయితే దానికి బలం చేకూర్చే విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు లేటెస్ట్ గా బయటపెట్టారు. సరిగ్గా వారం…

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని అంతటా ప్రచారంలో ఉంది. అయితే దానికి బలం చేకూర్చే విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు లేటెస్ట్ గా బయటపెట్టారు. సరిగ్గా వారం క్రితం సెప్టెంబర్ 10న గొల్ల బాబూరావుకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలు విశాఖ ఉక్కు కార్మికులకు షాకింగ్ గా మారాయి.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి గొల్ల బాబూరావు స్పెషల్ మెన్షన్ కింద ఆగస్టు 8న రాజ్యసభ లో ప్రస్తావించారు. దానికి పంకజ్ చౌదరి బాబూరావుకు లిఖిత పూర్వకమైన సమాధానాన్ని లేఖ ద్వారా తెలియచేశారు. అందులో పేర్కొన్న దాని మేరకు విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో నూటికి నూరు శాతం పెట్టుబడులను ఉప సం హరించుకోవడానికి ఆర్ధిక వ్యవహారాల కేబినేట్ కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు.

అంతే కాకుండా ఆత్మ నిర్బర్ భారత్ పాలసీ ద్వారా కొత్త పబ్లిక్ సెక్టార్ పాలసీకు కేంద్రం అనుమతించిందని కేంద్ర మంత్రి తెలిపారు. దీని ప్రకారం నాన్ స్ట్రాటజిక్ సెక్టార్లలో ఉండే పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ని అన్నీ ప్రైవేట్ రంగానికి ఇచ్చేయడంలో లేదా ఏకంగా మూసివేయడమో జరుగుతుందని కేంద్రం మంత్రి కుండ బద్ధలు కొట్టినట్లుగా ఆ లేఖలో చెప్పేశారు.

అంతే కాదు విశాఖ ఉక్కు కర్మాగారం నాన్ స్ట్రాటజిక్ సెక్టార్ లో ఉందని కూడా అసలు విషయమూ చెప్పేశారు. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నది ప్రైవేటీకరణ అవడం ఖాయమని కేంద్ర మంత్రి చావు కబురు చల్లగా చెప్పేశారు అన్న మాట.

అయితే కూటమి నేతలు మాత్రం స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెబుతున్నారు. అది అయ్యే పని కాదని అందరికీ తెలిసినా ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ ప్రయత్నాలు అన్నదే అర్ధం కాని విషయం. వైసీపీ ఎంపీ బాబూరావు బయటపెట్టిన లేఖలో ఉక్కు కార్మిక లోకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మండిపడుతోంది.

21 Replies to “ఉక్కుపై వేటు… సాక్ష్యమిదిగో !”

  1. tongue control lo pettukuni matladam nerchukondi ra steel plant workers. Madhyalo maa Pawan sir emi chesadu ra. voorike Pawan sir peru teesukosthe janasainks andaram kalisi kosi karam pedatham.

  2. అంతా బానే manage చేస్తున్నారు కానీ ….ఇంతకీ మన అన్నయ్య ఏం మాట్లాడలేదు ఎందుకు GA….😂😂… భయమా….గౌరవమా…

  3. Kootami false promises getting exposed by the day. What is the use of supporting central government with representatives from our state when they cannot save interests of our state. Loans instead of grants for capital and privatizing the pride of AP.

    1. Yep, for brainless , its useless. Eg: If funds allocated to Capital and Polavaram are loans , what’s the point in mentioning central budget. They mentioned it because, be it loan or grant its center’s responsibility. Already state finance secretary clarified it. Ofcourse blue channel wont show this and Pa

      1. You are ssying it as if you have drafted the budget. Nirmala Sertharaman had clearly stated that it was a loan from world bank and you shamelessly spread fake information.

        1. Brainless…she said its loan. She also mentioned we will also decide the repayment structure. After that formalities already done and state finance secretary mentioned 90:10 repayment ratio and repayment starts only after 30 yrs

          1. There are so many things that are verbally said and we’re later backtracked. There is only value to things that are put on paper as form of a GO or with a government seal. Show me a document where your so called 90:10 ratio was documented? Also, flash news, World Bank rejected Amaravathi as capital whichbputs the future of 15K crore in a dilemma.

          2. It was presented as part of budget within parliament and also confirmed as loan by central finance minister herself. What more proof do you need? Is you so called 90:10 ratio and repayment after 30 years discussed in parliament? When the bank that is supposed to provide the loan is not finalized, how will the terms be discussed unless it is fake propaganda.

          3. Do you know what is budget? Will you plan your brother/father loan as part of your budget? If loan repayment is from state govt, it should be burden for state govt and concern allocations should be from state budget. Yes, she mentioned the same in her after budget speech. Bank will consider terms only after having some guarantee, be it home loan or personal loan. Now they had gurantee of 90:10 , to frame other formalities they are touring Amaravati

          4. Yep , nothing new…same fabricated propaganada even after knowing the facts…be in that hallucination. Same world bank will allocate funds once all formalities are finalized

  4. Too bad. After 50 years they could not develop high grade steel that is strategically use din military and space industries? Lack of oversight of top management killed this pearl of Andhra. Atlteast protect its assets.

Comments are closed.