ఎన్టీఆర్ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్

మన స్టార్ హీరోలంతా తెలుగులోనే సినిమాలు తీస్తారు. మల్టీ లాంగ్వేజ్ అని చెప్పినా ప్రాధాన్యత తెలుగుకే ఉంటుంది. మరి ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో తమిళ్ లో సినిమా తీసి, తెలుగులో డబ్ చేస్తే…

మన స్టార్ హీరోలంతా తెలుగులోనే సినిమాలు తీస్తారు. మల్టీ లాంగ్వేజ్ అని చెప్పినా ప్రాధాన్యత తెలుగుకే ఉంటుంది. మరి ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో తమిళ్ లో సినిమా తీసి, తెలుగులో డబ్ చేస్తే ఎలా ఉంటుంది..

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఈ కోరిక స్వయంగా ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చింది. తమిళ్ లో తారక్ కు ఇష్టమైన దర్శకుడు వెట్రిమారన్ అంట. అతడితో నేరుగా ఓ తమిళ సినిమా తీయాలని ఉందని, ఆ సినిమాను తెలుగులో డబ్ చేయాలని ఉందంటూ ప్రకటించాడు ఎన్టీఆర్.

దేవర సినిమా ప్రమోషన్స్ కోసం చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ఎన్టీఆర్. అక్కడి మీడియాతో మాట్లాడాడు. ప్రెస్ మీట్ ఏర్పాటుచేసి దేవర విశేషాలు చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా నేరుగా తమిళ సినిమా చేయడంపై స్పందించాడు.

తమిళ్ లో నేరుగా సినిమా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ తన ఫేవరెట్ డైరక్టర్ వెట్రిమారన్ ముందుగా తనతో సినిమా చేయడానికి రెడీ అవ్వాలని అన్నాడు. వెట్రిమారన్ ఓకే అంటే డైరక్ట్ తమిళ సినిమా చేసి, దాన్ని తెలుగులోకి డబ్ చేస్తానని ప్రకటించాడు. ఈ సమాధానంతో తమిళ మీడియాను ఎట్రాక్ట్ చేశాడు తారక్.

5 Replies to “ఎన్టీఆర్ తమిళ సినిమా.. తెలుగు డబ్బింగ్”

Comments are closed.