హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో పుణ్యమా అని తెలుగుదేశం మహిళలు ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి విమర్శలతో చెలరేగిపోతున్నారు. ఇంతకంటే మంచి అవకాశం మరొకటి రాదనే రీతిలో వంగలపూడి అనిత అయితే పదేపదే న్యూడ్ వీడియో సంగతులే మాట్లాడుతున్నారు. ఇక తానెక్కడ వెనకపడి పోతానో అని మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె గ్రీష్మ ఇవాళ మీడియా ముందుకొచ్చారు.
ఒకవైపు మాధవ్ న్యూడ్ వీడియో చూడలేక చచ్చిపోయానంటూనే, దాని ఆధారంగా విమర్శలు చేశారు. మాధవ్ న్యూడ్ వీడియో వల్ల పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలుగుతుందని సలహాదారులు, ఐఏఎస్ అధికారులు చెప్పడం లేదా? అని ఆమె ప్రశ్నించారు. ఎటూ డ్యామేజీ అయింది కాబట్టి, ఇంకెందుకులే అని వారు కూడా ఊరుకుంటున్నారా? అని మళ్లీ ఆమె సమాధానం చెప్పారు. ఎటూ చెప్పినా మీరు వినే రకం కాదు కాబట్టి వారు చెప్పడం లేదా? అని అనేక రకాలుగా ఆమె ప్రశ్నించారు.
లైంగికదాడికి గురైన వికలాంగురాలిని పరామర్శించడానికి చంద్రబాబు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వెళితే మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏకంగా నోటీసులు పంపారని గుర్తు చేశారు. మరి ఈ దరిద్రుడికి నోటీసులు ఎందుకు పంపడం లేదు? అది కూడా మూడు రోజుల తర్వాత ఎందుకు స్పందించారని నిలదీశారు. ఎంపీగా ఉంటూ ఎందుకిలా చేశావని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. అసలు డీజీపీ ఎక్కడ? అన్నారు.
సోషల్ మీడియాలో టీడీపీ వాళ్లు చిన్న పోస్టులు పెట్టినా అర్ధరాత్రి వెళ్లి అరెస్టులు చేస్తున్నారన్నారు. మూడేళ్లలో బాగా డబ్బు సంపాదించి మదమెక్కారన్నారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం? అని సీఎంను ప్రశ్నించారు.
ఇంతకాలం ఎంపీలు ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అని అనుకునేదాన్ననన్నారు. ఢిల్లీలో కూచుని ఎంపీలు చేసే పని ఇది అని వెటకరించారు. గోరంట్ల మాధవ్‌పై మీరు ఇప్పటి వరకు తీసుకున్న యాక్షన్ ఏంటి? రోజా ఏదీ? గన్ వస్తుందని ఏదో ఆవిడ అన్నారు కదా! అని ప్రశ్నించారు. రోజా స్పందించదే అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. వీడియో చూశారా? కుటుంబ సభ్యులందరితో కలిసి టీవీలో వేసుకుని చూడు అని ఉచిత సలహా ఇచ్చారు.
కుటుంబ సభ్యులతో కలిసి చూడగలవా? ఏమైనా అంటే మీద పడి రక్కేసి వెధవ సెటైర్లు అని మండిపడ్డారు. ఈ వీడియో చూస్తే బాగా ఆనందం కలుగుతుందని దెప్పి పొడిచారు. లేడీ హోంమినిస్టర్ ఎక్కడ? ఆ దిక్కుమాలిన వీడియో చూసి ఎక్కడైనా వెళ్లిపోయారా? మీకు సిగ్గుమానం ఏవీ లేవన్నారు. గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేసే వరకూ ఉద్యమం ఆగదని ఆమె హెచ్చరించారు.