బాబుకు జైలు భయం

ఏడున్నర పదుల వయసు, నాలుగున్నర పదుల రాజకీయ అనుభవం దశాబ్దన్నర ముఖ్యమంత్రిత్వం ఇలా చంద్రబాబు అంటే ఇలా చెబుతారు. అపర చాణక్యుడు విజనరీ అని అంటారు. అటువంటి చంద్రబాబుకు జైలు భయం ఉందా. ఉంటుందా…

ఏడున్నర పదుల వయసు, నాలుగున్నర పదుల రాజకీయ అనుభవం దశాబ్దన్నర ముఖ్యమంత్రిత్వం ఇలా చంద్రబాబు అంటే ఇలా చెబుతారు. అపర చాణక్యుడు విజనరీ అని అంటారు. అటువంటి చంద్రబాబుకు జైలు భయం ఉందా. ఉంటుందా అంటే ఆయన పొలిటికల్ హిస్టరీ చూసిన వారికి ఉండదనే అనిపిస్తుంది. అయితే కాలం ఖర్మం కూడా రాజకీయాల్లో కలసి రాకపోతే ఏమైనా జరగవచ్చు అన్న థియరీ ఒకటి ఉంది.

వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ మాత్రం చంద్రబాబుకు జైలు భయం పట్టుకుంది అని అంటున్నారు. టీడీపీ హయాంలో అమరావతి రాజధాని పేరిట అతి పెద్ద భూ కుంభకోణం జరిగినని ఆయన ఆరోపించారు. రాజధాని ఫలానా అని ప్రకటించకముందే భూ దోపిడికి పాల్పడ్డారు అని మంత్రి అంటున్నారు.

అమరావతిలో రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ బిజినెస్ కి తెర లేపారని, అవన్నీ కూడా సిట్ విచారణలో తేలుతాయని గుడివాడ అంటున్నారు. ఆమరావతి లో అక్రమాలకు పాల్పడినందుకు జైలుకు వెళ్లాలన్న భయం చంద్రబాబుకు ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

భోగాపురానికి ఉత్తుత్తి శంకుస్థాపన చేసిన చంద్రబాబు అక్కడ ఇటుక కూడా వేయలేదని విమర్శించారు. ప్రజాలు అయిదేళ్ళలో మంచి చేసి ఉంటే టీడీపీకి 23 సీట్లు ఎందుకు వస్తాయో చంద్రబాబు ఒకసారి అయినా ఆలోచించుకున్నారా అని గుడివాడ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రా అభివృద్ధి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.