కాల్పుల్లో ఒక‌రి మృతి!

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి మండ‌లం మాధ‌వ‌రంలో జ‌రిగిన కాల్పుల్లో ఒక‌రి మృతి చెంద‌గా , మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు

అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి మండ‌లం మాధ‌వ‌రంలో జ‌రిగిన కాల్పుల్లో ఒక‌రి మృతి చెంద‌గా , మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇద్ద‌రు పాత సామాన్ల వ్యాపారుల‌పై తుపాకీతో దుండ‌గ‌లు కాల్పులు జ‌రిపారు. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు పాత సామాన్ల వ్యాపారులు ర‌మ‌ణ (30), హ‌నుమంతు (50) తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వీళ్లిద్ద‌రినీ రాయ‌చోటి ప్ర‌భుత్వాస్ప‌త్రికి బంధువులు తర‌లించారు. అనంత‌రం క‌డ‌ప రిమ్స్‌కు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ హ‌నుమంతు ప్రాణాలు కోల్పోయిన‌ట్టు పోలీసులు తెలిపారు. అస‌లు ఈ కాల్పుల‌కు దారి తీసిన ప‌రిస్థితులేంటో ఇంకా తెలియ‌రాలేదు.

కాల్పులు జ‌రిపిన దుండ‌గులు ఎవ‌రో తెలియాల్సి వుంది. ప్ర‌స్తుతం పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఇటీవ‌ల కాలంలో అన్న‌మ‌య్య జిల్లాలో హింసాయుత ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల విక‌లాంగుడు హ‌త్య‌కు గురి కావ‌డంపై సంచ‌ల‌నం చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. త‌న 12 ఏళ్ల కుమార్తెపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన కార‌ణంగా కువైట్ నుంచి వ‌చ్చి, మ‌రీ చంపి వెళ్లిన వైనం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది.

త‌న‌కు తానుగా హ‌త్య చేసిన‌ట్టు నిందితుడు సోష‌ల్ మీడియాలో చెప్పినంత వ‌ర‌కూ పోలీసులు క‌నుక్కోలేక‌పోయారు. ఇప్పుడు దుండ‌గుల కాల్పుల్లో పాత‌సామాన్ల వ్యాపారం చేసుకునే వ్య‌క్తి చ‌నిపోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా పోలీసులు శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడేందుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

2 Replies to “కాల్పుల్లో ఒక‌రి మృతి!”

  1. శాంతిభద్రతలా హా హా అవి ఎప్పుడో గాలికి వదిలేశారు. ఇప్పుడు అంతా ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశిస్తున్న, వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వాళ్ళని అరెస్టు చేయడానికే వాళ్ళకి టైం సరిపోవడం లేదు. పచ్చ బ్యాడ్జ్ పెట్టుకోండి ఫ్రీ లైసెన్సు వచ్చినట్టే, అరాచకాలు చేసినా, ఏమీ చేసినా ఎవరు మిమ్మల్ని ఏమి అనరు అని సలహాలు ఇచ్చారుగా, మంచి మందు తాగి ఇలాంటి ఘటనలకే పాల్పడతారు. మన పోలీసులు పక్కనుండి టీ తాగుతూ చోద్యం చూస్తారు.

Comments are closed.