శాశ్వతం అన్న మాట బయటకు చెప్పకపోయినా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తరచూ వల్లె వేసే మాట ఇదే. ఆనాడు అధికారంలో ఉన్నపుడు విజన్ 2020 పేరిట ఇరవయ్యేళ్ళు ఉమ్మడి ఏపీకి తానే సీఎం గా ఉండాలని చంద్రబాబు తపనపడిన సంగతి తెలిసిందే. విభజన ఏపీలో కూడా విజన్ 2050 పేరిట ఏకంగా తానూ తన కుటుంబం ఏపీని ఏలాలని కూడా టీడీపీ పెద్దలు గట్టి ప్రతిన పూనారన్నదీ అంతా చెబుతారు.
అలాంటి టీడీపీకి శాశ్వతం అన్న మాట మరో పార్టీ నోట వస్తే నిజంగా హార్ట్ ఎలా కొట్టుకుంటుందో కదా అని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ వైసీపీకి శాశ్వత ప్రెసిడెంట్ గా ప్లీనరీలో తీర్మానం చేయడంతోనే టీడీపీ సహా విపక్షాలు అన్నీ తలో విధంగా విమర్శలు చేస్తూ వస్తున్నాయి. చంద్రబాబు అయితే ఇది నియంతృత్వ పోకడ అంటూ నిప్పులు చెరిగారు.
ఇలాంటి వాటికి గట్టి జవాబుని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చెప్పారు. అవును మా వైసీపీకి జగనే శాశ్వత అధ్యక్షుడు. ఇందులో రెండవ మాట లేనే లేదు అని కూడా పేర్కొన్నారు. అంతే కాదు ఏపీకి శాశ్వత సీఎం కూడా జగనే సుమా అంటూ అసలైన బాంబు పేల్చారు.
మీరు అలా చూస్తూ ఉండండి జగన్ జీవించి ఉన్నంతకాలం ఏపీకి ఆయనే సీఎం. ఆయన తప్ప వేరే వారు ఆ కుర్చీలోకి రారు. రాలేరు కూడా. ఇది జనం మాట అని కూడా మజ్జి శ్రీనివాసరావు గట్టిగా చెప్పారు. వైసీపీకి శాశ్వత ప్రెసిడెంట్ జగన్ అంటేనే ఇబ్బందిపడుతున్న విపక్షానికి ఏపీకి జగన్ తప్ప మరో సీఎం ఎవరూ ఉండరు అని మజ్జి శ్రీనివాసరావు చెబితే తట్టుకోగలరా అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇది అక్షరాలా జరిగే విషయమని, అందుకే గుండెలు చిక్కబట్టుకుని ఈ నిజాన్ని అంతా అంగీకరించాల్సిందే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఏపీలో మూడేళ్ళ పాలనలో ఒక్క అవినీతి కూడా లేకుండా చూసిన ఘనత జగన్ ది అని మజ్జి కీర్తించారు.
ప్లీనరీ సూపర్ డూపర్ హిట్ కావడంతో దుష్టచతుష్టయానికి కళ్ళు పచ్చబారాయని ఆయన సెటైర్లు వేశారు. మజ్జి వారు చెప్పినట్లుగా జగనే ఏపీకి శాశ్వత సీఎం అంటే మరి విపక్షం కుర్చీ మీద పెట్టుకున్న గంపెడు ఆశలు ఏం కావాలో కదా.
chala kalam tharuvatha nijanga navotchae joke vinna yenkati
Vaado pedda siddhanthi..veedo pedda vedaanthi